నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో నీట్ పీజీ ఎంట్రెన్స్ పరీక్ష ఆదివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 265 మంది అభ్యర్థులకుగాను 263 మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. ఏవీ ఎంటర్ ప్రైజెస్ పరీక్ష కేంద్రంలో 175 మంది అభ్యర్ధులకుగాను 174 మంది, అయేషా కా లేజీ సెంటర్‌లో 90 మందికి గాను 89 మంది పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎస్సీ స్టడీ సర్కిల్ సెంటర్ టిఫిన్‌లో పురుగులు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఆదివారం ఉదయం అందించిన అల్పాహారంలో తెల్ల పు రుగులు కనిపించాయి. స్టడీ సర్కిల్‌లో కో చింగ్ పొందుతున్న అభ్యర్థులకు ఆదివారం ఉదయం బోండాలు అందించారు. అభ్యర్థు లు తింటున్న క్రమంలో బజ్జీల్లో తెల్లపురుగు లు కనిపించాయి. నాలుగు నెలల క్రితం స్టడీ సర్కిల్‌ను ప్రారంభించగా, అప్పటి నుంచి భోజనం సక్రమంగా ఉండటం లేదని, స్టడీ సర్కిల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్యను పరిష్కరించడం లేదనే ఆరోపణ లు వ్యక్తమవుతున్నాయి. స్టడీ సెంటర్‌పై కలెక్టర్ దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
బాధిత కుటుంబానికి
ఆర్థిక సాయం
బాన్సువాడ : వర్ని మండలం తగిలేపల్లి మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబానికి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. వెంకన్న ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. మాజీ సర్పంచ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న పోచారం ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ తన వెంట ఉండే నాయకుడు వెంకన్న హత్యకు గురికావడం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఉన్నారు.


