నిజామాబాద్ రూరల్ : యోగా అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నందిపేట్‌లోని ఉజ్వల హైస్కూల్‌లో 17వ జిల్లా స్థాయి యోగాసన పోటీలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఐశ్వర్య కాళె తెలిపారు. జిల్లా కేంద్రంలోని అసోసిమేషన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 8 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి వివిధ కేటగిరీలుగా పోటీలు ఉంటాయని, పాల్గొనదలచిన వారు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. మరింత సమాచారం కోసం 8106420241, 80749 82200 నంబర్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో టీవీ ప్రవీణ్‌నాయుడు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


