● జిల్లాలో నందిపేట మండలమే టాప్
● ఐకేపీ ఏపీఎం గంగాదర్
నందిపేట్(ఆర్మూర్): 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను నందిపేట మండలం మహిళా సంఘం సభ్యులకు రూ.91 కోట్ల రుణాలను ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలోనే నందిపేట మండలం అత్యధికంగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు ఐకేపీ ఏపీఎం గంగాధర్ తెలిపా రు. మండల కేంద్రంలోని సీ్త్రశక్తి భవనంలో శని వా రం మండల మహిళా సమాఖ్య 19వ వార్షిక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఈ ఆర్థి క సంవత్సరంలో సాధించిన విజయాలు, రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి చ ర్చించారు. ఏపీఎం మాట్లాడుతూ.. 2026–27 సంవత్సరంలో మహిళా సంఘ సభ్యులకు బ్యాంకు లింకేజీ కింద రూ. 76కోట్లు, సీ్త్రనిధి రూ.15కోట్లు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం మండల సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా సిహెచ్ కొండూర్ గ్రామానికి చెందిన తుల సమ్మ, కార్యదర్శిగా ప్రవీణ, కోశాధికారిగా రుకియా ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నందిపేట సర్పంచ్ ఎర్రం లింగం, తహసీల్దార్ లక్ష్మణ్, వివిద గ్రామాల మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


