ఓటరు జాబితాలో తప్పుల సవరణకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితాలో తప్పుల సవరణకు కృషి చేయాలి

Aug 30 2026 1:33 AM | Updated on Aug 30 2026 1:33 AM

జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌

పల్లెగంగారెడ్డి

ఆర్మూర్‌: ఓటరు జాబితా తప్పుల సవరణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జాతీయ పసుపు బోర్డు చై ర్మన్‌ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని మేరు సంఘంలో ఆర్మూర్‌లో బీజేపీ ఎస్‌ఐఆర్‌ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఫేస్‌ 2 వర్క్‌షాప్‌ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అసెంబ్లీస్థాయి వర్క్‌షాస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... ప్రతి బూత్‌లో బీజేపీ తరఫున నియమించిన బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పని చేయాలని సూచించారు. ఓటరు లిస్టులో తప్పులు ఉంటే సరిచేయడం, కొత్తగా ఓటు నమోదుకు అర్హులైన యువ తీ యువకులు, మహిళలను గుర్తించి వారిని ఓటర్లు గా నమోదు చేయించేలా ప్రతి గ్రామంలో, ప్రతి బూత్‌లో తిరిగి పని చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు లోక భూపతిరెడ్డి, రాష్ట్ర నాయకులు అల్జాపూర్‌ శ్రీనివాస్‌, పెద్దోళ్ల గంగారెడ్డి, గంగాధర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, పొ ల్కం వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement