మౌలిక వసతుల కల్పనకు సహకారం అందిస్తా | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతుల కల్పనకు సహకారం అందిస్తా

Jul 29 2026 2:16 AM | Updated on Jul 29 2026 2:16 AM

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన కు సహకారం అందిస్తానని బాల్కొండ ఎమ్మెల్యే వే ముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్‌రెడ్డి కాలేజ్‌కు వితరణ చేసి న రూ. 1.50 లక్షల విలువ చేసే 40 డ్యూయెల్‌ డె స్క్‌ బెంచీలను ఎమ్మెల్యే అందజేశారు. ప్రిన్సిపాల్‌ జైపాల్‌రెడ్డి, మండలప్రత్యేకాధికారి రాజగంగారాం, ఎంపీవో సదాశివ్‌, సొసైటీ చైర్మన్లు రేగుంట దేవేంద ర్‌, కుంట ప్రతాప్‌రెడ్డి, సర్పంచులు హారిక, బెజ్జా రం రాకేశ్‌, ఎండీ మెహబూబ్‌, నాయకులు బద్దం చి న్నారెడ్డి, సుభాష్‌గౌడ్‌, సుధాకర్‌, నరేందర్‌, అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కును కోల్పోవద్దు

బాల్కొండ నియోజకవర్గ పరిధిలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్ర శాంత్‌రెడ్డి కోరారు. కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, బాల్కొండ, మెండోరా మండల తహసీల్‌ కార్యాలయాలను సందర్శించిన ఆయన సంబంధిత తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సర్‌ నమోదు ప్రక్రియ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే నో మ్యాపింగ్‌, డెత్‌, డబుల్‌, షిఫ్టెడ్‌ (ఏఎస్‌డీ) కేటగిరీల్లో నమోదైన ప్రతి కేసును పునఃపరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు.

నాణ్యమైన భోజనం అందించాలి

వేల్పూర్‌: ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న ప్రతి విద్యార్థిని నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండలోని క్యాంప్‌ ఆఫీ సులో జిల్లా సహాయ షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి రాజగంగారాం, సహాయ వెనుకబడిన కులాల అభివృద్ధి అధికారి సుజయ్‌, నియోజకవర్గా నికి చెందిన హాస్టళ్ల వెల్ఫేర్‌ ఆఫీసర్లు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement