డిజిటల్ కామర్స్‌తో ఉపాధి అవకాశాలు
ఖలీల్‌వాడి: డిజిటల్ కామర్స్ రంగంలో ఉపాధి అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని వక్తలు పేర్కొన్నారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల కా మర్స్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘బిజినెస్ వేవ్స్ ఇన్ కామర్స్, డిజిటల్ వేవ్స్, అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై జాతీయ సెమినార్ నిర్వహించారు. సదస్సుకు ప్రిన్సిపాల్ డాక్టర్ రాంమోహ న్ రెడ్డి అధ్యక్షత వహించగా, తెయూ రిజిస్ట్రార్ ప్రొ ఫెసర్ యాదగిరి కీనోట్ స్పీకర్‌గా వ్యవహరించారు. మహారాష్ట్రలోని ఉద్గి మహావిద్యాలయ ప్రొఫెసర్ బాలాజీ, ప్రొఫెసర్ సులోచన విశిష్ట అతిథిగా పా ల్గొని మాట్లాడారు. ఆధునిక డిజిటల్ యుగంలో కా మర్స్ సమాజంలో ప్రతి అంశంతో కనిపిస్తుందని, కాలానుగుణంగా ఆధునిక కామర్స్ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. డీఏ డాక్టర్ కె.రంజిత, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


