అనుమానంతో నిండు గర్భిణి హత్య | - | Sakshi
Sakshi News home page

అనుమానంతో నిండు గర్భిణి హత్య

Feb 26 2026 9:10 AM | Updated on Feb 26 2026 9:10 AM

అనుమానంతో నిండు గర్భిణి హత్య

అనుమానంతో నిండు గర్భిణి హత్య

భర్త రిమాండ్‌

ఇందల్వాయి: ఇందల్వాయి మండల పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది. నిండు చూలాలు అని చూడకుండా గొంతు నులిమి భర్త హతమార్చాడు. మండలంలోని గన్నారం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన వివరాలు డిచ్‌పల్లి సీఐ వినోద్‌, ఎస్సై సందీప్‌ తెలిపారు. గన్నారం గ్రామానికి చెందిన ఎర్గు నగేశ్‌కి కామారెడ్డి జిల్లా తిమ్మకపల్లి గ్రామానికి చెందిన సుమలతతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు మగ పిల్లలు ఉండగా సుమలత ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. భార్యాభర్తల మధ్య అనుమానాల కారణంగా తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో నగేశ్‌ మద్యానికి బానిసై సుమలతను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. అయితే, రెండో వివాహం చేసుకోవాలన్న దురుద్దేశంతో ఈ నెల 23న అర్ధరాత్రి సుమలత నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా నగేశ్‌ నేరం అంగీకరించాడు. మృతురాలి తల్లి జగ్గ బాల రాజవ్వను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. తల్లి మరణించడం, తండ్రి దూరమవ్వడంతో ముగ్గురు కొడుకులు అనాథలయ్యారని గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement