ఒకరి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఒకరి ఆత్మహత్యాయత్నం

Feb 26 2026 9:10 AM | Updated on Feb 26 2026 9:10 AM

ఒకరి ఆత్మహత్యాయత్నం

ఒకరి ఆత్మహత్యాయత్నం

ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం

మోపాల్‌: మండలంలోని న్యాల్‌కల్‌ గ్రామంలో ఓరికె లక్ష్మణ్‌ అనే వ్యక్తి పదునైన ఆయుధంతో గొంతు కోసుకుని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ్‌ తన తల్లి సాయవ్వతో కలిసి నివాసం ఉంటున్నాడు. లక్ష్మణ్‌ మొదటి భార్య చనిపోగా, రెండో భార్య కొన్నేళ్లుగా దూరంగా ఉంటోంది. కుమారుడు గతంలోనే అనారోగ్యంతో మృతిచెందాడు. ఈక్రమంలో లక్ష్మణ్‌ తాగుడుకు బానిసయ్యాడు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే పదునైన ఆయుధంతో గొంతు కోసుకున్నాడు. తీవ్ర గాయాలైన లక్ష్మణ్‌ను 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఈఎంటీ స్వామి గౌడ్‌, పైలెట్‌ స్వామి తెలిపారు. ప్రస్తుతం లక్ష్మణ్‌ పరిస్థితి నిలకడగా ఉందని, మాట్లాడటానికి ఇబ్బంది ఉందని తెలిసింది.

మోపాల్‌: మండలంలోని బాడ్సి శివారులో 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని పలువురు రైతులు అవసరం నిమిత్తం మంచిప్ప రిజర్వాయర్‌ కంపెనీకి ఇచ్చారు. గత కొన్నేళ్లుగా ట్రాన్స్‌ఫార్మర్‌ను వినియోగించలేదు. కొన్ని నెలల క్రితం ట్రాన్స్‌ఫార్మర్‌ కింద పడిపోయింది. అవసరం లేదని రైతులు పట్టించుకోలేదు. ఇటీవల భూమిని సాగులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించగా, ధ్వంసం చేసి కాపర్‌, ఆయిల్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. విషయాన్ని లైన్‌మన్‌ జహీరుద్దీన్‌ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement