ఎలా ఉంటుందో? | - | Sakshi
Sakshi News home page

ఎలా ఉంటుందో?

Feb 8 2026 3:54 AM | Updated on Feb 8 2026 3:54 AM

ఎలా ఉ

ఎలా ఉంటుందో?

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌
ఇందూరు ఫలితం
కారులో హుషారు!

వాతావరణం

ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. రాత్రి పొగమంచు కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగే అవకాశాలున్నాయి.

భీమ్‌గల్‌.. దంగల్‌

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోగా.. అందరి చూపు భీమ్‌గల్‌ పురపాలకంపై పడింది.

ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

– 8లో u

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో శనివారం రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించారు. ఆయన ప ర్యటన బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ తెచ్చింది. బా న్సువాడ పట్టణం నడిబొడ్డున నిర్వహించిన సభ లో కేటీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డి, బాన్సువాడ ఎ మ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని టార్గెట్‌ చేసి మా ట్లాడారు. అప్పట్లో ఇదే గడ్డమీద రేవంత్‌రెడ్డి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని, ఆయన కొడుకులను దున్నపోతులు, ఆంబోతులు అని సంబోధించిన ఆడియోను వినిపించారు. పోచారం పార్టీ మారడంతో దొంగ చాటు గా ప్రచారం చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను, బాన్సువాడ ప్రజలను మోసం చేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి గుణపా ఠం చెప్పాలని ప్రజలను కోరారు. కేటీఆర్‌ ముందుగా బాన్సువాడకు చేరుకున్నారు. పట్టణ శివార్లలోని కొయ్యగుట్ట అమరవీరుల స్తూపం వద్ద నుంచి ర్యాలీగా వచ్చి అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద సభలో మాట్లాడారు. అనంతరం బిచ్కుంద పట్టణంలో రోడ్‌షో, ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణంలోనూ భారీ ర్యాలీ తీశారు.

కామారెడ్డి జిల్లాలోని మూడు

మున్సిపాలిటీల్లో కేటీఆర్‌ ప్రచారం

నిజామాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పోటాపోటీ ఉంది. మధ్యలో ఎంఐఎం ప్రత్యేకమైన ప్రాంతాల్లో కచ్చితంగా సీట్లను గెలుచుకునే వాతావరణం కనబడుతోంది. 2014లో 50 డివిజన్లకు గాను ఎంఐఎం 16 డివిజన్లు గెలుచుకుంది. అప్పుడు మ్యాజిక్‌ ఫిగర్‌ 26. అదేవిధంగా 2020లో జరిగిన ఎన్నికల్లోనూ ఎంఐఎం 60 డివిజన్లకు గాను మళ్లీ 16 డివిజన్లలో గెలిచింది. అప్పుడు మ్యాజిక్‌ ఫిగర్‌ 31. ఈ రెండుసార్లూ ఎంఐఎం కింగ్‌మేకర్‌గా నిలిచింది. వరుసగా రెండు టర్మ్‌ల్లో డిప్యూటీ మేయర్‌ సీటును ఎంఐఎం దక్కించుకుంది. అయితే ఈసారి కూడా ఎంఐఎం 16 డివిజన్లు కచ్చితంగా గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఎంఐఎం మరోసారి కింగ్‌మేకర్‌ అవుతుందా లేక ఫలితం మారుతుందా అని పలువురు లెక్కలు వేసుకుంటున్నారు. ఎక్స్‌ అఫీషియో ఓట్లు మరో సారి కీలకం కానున్నాయనే చర్చ జరుగుతోంది. గత రెండు ఎన్నికల్లోనూ ఎక్స్‌ అఫీషియో ఓట్లు వినియోగించుకోవడమే ఇందుకు కారణం.

2014లో ఎంఐఎం 16 డివిజన్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిస్తే, బీఆర్‌ఎస్‌ 10 డివిజన్లకు పరిమితమైంది. అయితే ఎంఐఎం మద్దతుతో బీఆర్‌ఎస్‌ మేయర్‌ పీఠం దక్కించుకుంది. ఆ సమయంలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ ఎక్స్‌ అఫీషియో ఓట్లను వినియోగించుకున్నారు. అప్పటి ఎంపీ కవిత ఆర్మూర్‌లో తన ఎక్స్‌ అఫీషియో ఓటును వినియోగించుకున్నారు.

2020లో జరిగిన ఎన్నికల్లో 60 డివిజన్లకు గాను బీజేపీ అత్యధికంగా 28 డివిజన్లు గెలుచుకుంది. ఎంఐఎం 16 చోట్ల, బీఆర్‌ఎస్‌ 13 చోట్ల, కాంగ్రెస్‌ 02 చోట్ల, ఒక డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఆ సమయంలో బీజేపీకి ఒక్క ఎంపీ అర్వింద్‌ మాత్రమే ఎక్స్‌ అఫీషియో ఓటరుగా ఉన్నారు. ఈసారి సైతం ఎంఐఎం మద్దతుతో బీఆర్‌ఎస్‌ మే యర్‌ పీఠం దక్కించుకుంది. మేయర్‌ ఎన్నిక కోసం బీఆర్‌ఎస్‌కు చెందిన నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌ ఎమ్మె ల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌లు ఎక్స్‌ అఫీషియో ఓట్లను వినియోగించుకున్నారు. ఎంఐఎంకు డిప్యూటీ మేయర్‌ ఇచ్చారు.

తాజా పరిస్థితి చూస్తే బీజేపీకి ఐదుగురు ఎక్స్‌ అఫీషియోలు ఉన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్‌ రెడ్డి, పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు చిన్నమైల్‌ అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఉన్నారు. కాంగ్రెస్‌కు ఇద్దరు ఎక్స్‌ అఫీషియోలు ఉన్నారు. రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఉన్నారు. కాగా బీజేపీ, ఎంఐఎంలు కలిసే అవకాశాలు లేకపోవడంతో బీజేపీ 27 సీట్లు పైగా గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండడంతో కాంగ్రెస్‌ పార్టీ 15 సీట్లు గెలుచుకున్నప్పటికీ మేయర్‌ పీఠం చేజిక్కించుకునే అవకాశాలున్నాయి. ఇక బీ ఆర్‌ఎస్‌, స్వతంత్రులు సైతం కొన్ని సీట్లు గెలుచుకు నే అవకాశాలు లేకపోలేదు. ఇలా జరిగితే బల్దియా లో సమీకరణలు మరింత రసవత్తరం అవుతాయి. దీంతో మరోసారి నిజామాబాద్‌లో ఎక్స్‌ అఫీషియో ఓట్ల లెక్కలతో నంబర్‌ గేమ్‌ తప్పదు.

ఎక్స్‌ అఫీషియో ఓట్లే కీలకమా..?

స్వతంత్రులు గెలిచినా ప్రాధాన్యత

బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటాపోటీ

ఎంఐఎం కింగ్‌మేకర్‌గా నిలిచే

అవకాశాలు

రాజకీయ, వివిధ వర్గాల్లో ఆసక్తికర చర్చ

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఎలాంటి ఫలితాలు వస్తాయోననే ఆసక్తికర చర్చ నెలకొంది. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇందూరు ఫలితంపై ఆసక్తి చూపుతున్నారు. కాగా పరిస్థితులు చూస్తుంటే ఇక్కడ మ్యాజిక్‌ నంబర్‌ గేమ్‌ తప్పేలా లేదు. గతంలోనూ ఇక్కడ నంబర్లాటలు చోటుచేసుకున్నాయి. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌

ఎలా ఉంటుందో?1
1/3

ఎలా ఉంటుందో?

ఎలా ఉంటుందో?2
2/3

ఎలా ఉంటుందో?

ఎలా ఉంటుందో?3
3/3

ఎలా ఉంటుందో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement