రెండోరోజు నామినేషన్లు 242
36వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న లాభిశెట్టి లావణ్య శ్రీనివాస్
నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్
సుభాష్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లోభాగంగా రెండోరోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసా గింది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 20 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటుచేసిన విష యం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం తర్వా త ముహూర్తం బాగుండటంతో నామినేషన్ల దా ఖలుకు అన్ని పార్టీల అభ్యర్థులు కేంద్రాలకు బా రులు తీరారు. సాయంత్రం 5 గంటలలోగా కేంద్రాలకు వచ్చిన వారి నుంచి రాత్రయినా నామాపత్రాలు స్వీకరించారు. రెండోరోజు 242 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజైన శుక్రవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు మున్సిపల్ అధికారులు, పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కార్పొరేషన్‌లో బారులు
నో డ్యూ సర్టిఫికెట్ కోసం అభ్యర్థులు, ప్రతిపాదకులు నిజామాబాద్ కార్పొరేషన్ కార్యాలయంలో బారులు తీరారు. నామినేషన్ పత్రంతో నో డ్యూ సర్టిఫికెట్ జతపర్చడం తప్పనిసరి కావడంతో గంటల తరబడి ఎదురుచూసి తీసుకెళ్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాశారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను చెల్లించి నో డ్యూ సర్టిఫికెట్ పొందుతున్నారు. పాత బకాయిలు చెల్లిస్తుండటంతో బల్దియా ఖజానాలో దండిగా జమ అవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
మూడు మున్సిపాలిటీల్లో 158..
నిజామాబాద్ అర్బన్: ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో రెండో రోజైన గురువారం మొత్తం 158 నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఆర్మూర్‌లో 61, బోధన్‌లో 72, భీమ్‌గల్‌లో 25 మంది నామినేషన్‌లు దాఖలు చేశారు.
నామినేషన్లు
నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియలోభాగంగా రెండోరోజు భారీగా నామినేషన్‌లు దాఖలయ్యాయి. గురువారం ఒక్కరోజే 242 దాఖ లయ్యాయి. మొదటిరోజు 13 మంది నా మినేషన్లు సమర్పించారు. బీజేపీ 72, కాంగ్రెస్ 82, బీఆర్‌ఎస్ 26, ఎంఐఎం 24, ఇండిపెండెంట్లు 21 మంది, ఇతరులు 17 మంది ఉన్నారు. అత్యధికంగా 33వ డివిజన్ నుంచి 11 నామినేషన్‌లు దాఖలు కాగా.. 57వ డివిజన్ నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఒక్కో అభ్యర్థికి సుమా రు గంటకుపైగానే సమయం పడుతోందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. నామినేషన్‌ల దరఖాస్తు కోసం అభ్యర్థులు అనుచరులతో తరలివస్తున్నారు.
నేటితో ముగియనున్న
నామపత్రాల స్వీకరణ
చివరిరోజు భారీగా
నామినేషన్లకు అవకాశం
నో డ్యూ సర్టిఫికెట్ల కోసం క్యూ
కేంద్రాలను పరిశీలించిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
రెండోరోజు నామినేషన్లు 242


