ఆగని పసిడి పరుగు
తులం ధర రూ.1,86,000 వెండి కిలో రూ.4,20,000
నిజామాబాద్ రూరల్: పసిడి ధర పరుగు పె డుతోంది. వారం క్రితం 24 క్యారెట్ల ధర రూ.1,50,800 కాగా.. గురువా రం రూ. 1,86,000కు చేరింది. మరో వైపు వెండి ధర రూ.4.20 లక్షలకు చేరింది. బంగారం, వెండి ధరల పెరుగుదల కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం కొనే పరిస్థితి లేకుండాపోతోందని సామాన్య, మధ్యతరగతి ప్రజ లు వాపోతున్నారు. జ్యుయెలరీ షాపుల వా రు గిరాకీ లేక, బంగారం నగలు తయారీదా రులు పనిలేక ఇబ్బందులు పడుతున్నారు.
బంగారం, వెండి ధర పెరుగుతుండడంతో మా మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. బంగా రం ధర రూ.2 లక్షలకు చేరేలా ఉంది. రోజురోజూ పెరుతుండడంతో కొనేవారు క రువవుతున్నారు. స్వర్ణకార వృత్తిపై ఆధారపడిన వారికి పని లేకుండాపోతోంది. – చిలుముల భూషణ్‌చారి, నగల తయారీదారు
ఆగని పసిడి పరుగు


