అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): మున్సిపల్ ఎన్నికల నే పథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తత తో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఇలా త్రిపా ఠి ఆదేశించారు. భీమ్‌గల్ పట్టణంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. రిటర్నింగ్ అధికారులతో మాట్లా డి దాఖలైన నామినేషన్‌ల వివరాలను తెలుసుకున్నారు. నామినేషన్ పత్రాలు తెలుగు, ఇంగ్లి ష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. చివరి రోజైన శుక్రవారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గందరగోళానికి తావులేకుండా అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఆయా పార్టీల తరఫున నామినేషన్‌లు దాఖలు చేస్తున్న వారు నిర్ణీత గ డువు లోగా బీఫారాలు సమర్పించాలని, లేని పక్షంలో వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మా ల్వియా, మున్సిపల్ కమిషనర్ గంగాధర్ ఉన్నారు.


