ఐటీఐతో పాలిటెక్నిక్ లేటరల్ ఎంట్రీకి దరఖాస్తులు
ఖలీల్‌వాడి: నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో లేటరల్ ఎంట్రీ (రెండవ సంవత్సరంలో ప్రవేశాలు) కోసం ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ(బాలుర) ప్రిన్సిపాల్ యాదగిరి ఒక ప్రక టనలో తెలిపారు. రెండేళ్ల ఐటీఐ కోర్సును పూ ర్తి చేసి కనీసం 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులకు పాలిటెక్నిక్ రెండో ఏడాదిలో నేరు గా ప్రవేశం ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు ప్రభుత్వ ఐటీఐ (బాలుర) కళాశాలలో ఫి బ్రవరి 21లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 85004 67091ను సంప్రదించాలన్నారు.
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఉత్తర తిరుమల ఆలయంలో బుధవారం నుంచి ఆలయ 6వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవా లు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. నేటి సాయంత్రం ఉత్సవాల ప్రారంభం, 29న శేష వాహనంపై స్వామివారి ఊరేగింపు, 30న హనుమంత వాహన సేవ, ి31న శ్రీనివాస కల్యాణం, గజవాహనం ఫిబ్రవరి 1న గరుడ వాహనసేవా, 2 న చక్రస్నానం మహపూర్ణహుతి, విశేష అభి షేకం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమాని కి పెద్దఎత్తున భక్తులు పాల్గొనాలని కోరారు.
మాక్లూర్: మండలంలోని ఎంఈవో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి సంజీవ్ ఇటీవల ఆ త్మహత్యకు పాల్పడగా, బాధిత కుటుంబానికి మంగళవారం మండలానికి చెందిన ఉపాధ్యాయులు డీఈవో అశోక్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం రూ.89వేల616ను అందించారు. ఎంఈవో సత్యనారాయణ, పీఆర్టీయూ ప్రతినిధులు మోహన్‌రెడ్డి, కిషన్, గడ్డం నగేష్ రెడ్డి, ఉపాధ్యాయులు సురేష్, మాక్లూర్ మాజీ విండో చైర్మన్ రమణారావు, మాజీ ఎంపీటీసీ కోకా హైమద్, నర్సాగౌడ్ పాల్గొన్నారు.
సుభాష్‌నగర్: ఎౖక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కు టుంబానికి అండగా నిలుస్తామని ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ హెల్త్ స్టేట్ హెడ్, కవితా రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కవితారెడ్డి భరోసానిచ్చారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న ఎకై ్సజ్ కానిస్టేబుల్ సౌమ్యను మంగళవారం సాయంత్రం ఆమె ప రామర్శించారు. ప్రస్తుతం సౌమ్యకు అందుతు న్న వైద్య చికిత్సల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వైద్యులను కోరారు. సౌమ్య త్వరగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాలని ఆమె ఆకాంక్షించారు.
నిజామాబాద్ రూరల్: తమకు ఐదు రోజుల ప ని విధానం అమలు చేయాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవా రం జిల్లాలోని అన్ని బ్యాంక్‌లకు చెందిన ఉద్యోగులు సమ్మె, ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈసందర్భంగా యూఎఫ్‌బీయూ నాయకులు మాట్లాడుతూ.. ఐడీఏ డిమాండ్‌ను అంగీకరించి ఒప్పందం చేసుకున్నప్పటికీ, ఇ ప్పటివరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడం సరికాదన్నారు. తక్షణమే ఐడీఏతో కుదిరిన ఒప్పందాలను అమలు చేసి 5 రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. బ్యాంక్ ఉద్యోగులు యూఎఫ్‌బీఐ, ఎ న్‌సీబీఈ రమేశ్, రాజేశ్వర్‌రావు, వంశీకృష్ణ, ఓంకార్ క్రాంతి, జగన్, ఉదయ్, అన్వేష్, నాయ కులు భూమన్న, ఓమయ్య, తదితరులున్నారు.
ఐటీఐతో పాలిటెక్నిక్ లేటరల్ ఎంట్రీకి దరఖాస్తులు
ఐటీఐతో పాలిటెక్నిక్ లేటరల్ ఎంట్రీకి దరఖాస్తులు


