బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
బోధన్‌రూరల్: బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇ వ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉపాధ్యాయులకు సూ చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులను లోనికి అనుమతించొద్దని, తల్లిదండ్రులు వస్తేనే విద్యార్థినులను వారి వెంట ఇంటికి పంపాలని సూ చించారు. బోధన్ మండలం అమ్దాపూర్‌లోని కస్తూ ర్బా గాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్‌న్స్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. 8వ తరగతి గదిలోకి వెళ్లి పా ఠాలు బోధించి వారి అభ్యసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తీసుకువచ్చిన చాక్లెట్లను పంపి ణీ చేశారు. పాఠశాల చుట్టూ వెంటనే ప్రహరీ నిర్మించాలని, ప్రమాదకరంగా ఉన్న గుంతను పూడ్చి వే యించాలని, విద్యుత్ వైరింగ్ సరి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఈవో అశోక్, ఎంఈవో నాగయ్య, హిమబిందు ఉన్నారు.


