‘నరేంద్ర’ స్మారక క్రీడాపోటీలు
సుభాష్‌నగర్: నగరంలోని ఆఫీసర్స్ క్లబ్‌లో మంగళవారం దివంగత జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర స్మా రక క్రీడాపోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి వైద్యుడు జలగం తిరుపతి రావు పాల్గొని, మాట్లాడారు. నరేంద్ర విధి నిర్వహణలో మృతిచెంది 35 ఏళ్లు గడుస్తున్నా.. ఆయన పేరుతో స్మారక క్రీడా పో టీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. అ నంతరం నిర్వహించిన షటిల్ పోటీల ఫైనల్ మ్యా చ్‌లో భానుతేజ, సందీప్‌పై శ్రీకాంత్, రాజలింగం జట్టు 6 –15 తేడాతో గెలుపొందింది. నరేంద్ర మె మోరియల్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ సాయిలు, కన్వీ నర్ నర్సయ్య, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధా నకార్యదర్శి సుభాష్, కోశాధికారి రాజ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు తదితరులు పాల్గొన్నారు.


