డ్రంకన్‌డ్రైవ్ కేసుల్లో పలువురికి జైలుశిక్ష
కామారెడ్డి క్రైం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పలువురు పోలీసులకు పట్టుబడ్డారు. వారిని పోలీసులు మంగళవారం స్థానిక కోర్టుల్లో హాజరు పర్చగా, 10 మందికి ఒకరోజు జైలు శిక్ష, వారితోపాటు మొత్తం 38 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానాలు విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమన్నారు. జిల్లాలోని అన్ని పీఎస్‌ల పరిధిలో క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
వేల్పూర్: వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇటీవల ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సుమారు 77 ట్రాక్టర్లను పట్టుకోగా, ఇసుకకు మంగళవారం తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. కుకునూర్ గ్రామానికి చెందిన ఆరె రాజేందర్ అందరికంటే ఎక్కువగా పాట పాడడంతో అతనికి ఇసుకను కేటాయించారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గోపాల్, సీనియర్ అసిస్టెంట్ స్వాతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


