రిజర్వేషన్లు ఖరారు
న్యూస్‌రీల్
నిజామాబాద్
● రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కొనసాగిన ప్రక్రియ
● డివిజన్లు, వార్డుల వారీగా వెల్లడించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఇసుక అక్రమ దందాకు అడ్డేది?
మాక్లూర్ మండలంలోని చిక్లీ, వల్లభాపూర్ ఇసుక క్వారీల్లో అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది.
ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026
– 8లో u
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ రిజర్వేషన్లు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 2011 జనాభా ప్రాతిపదికన, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్ కేటాయింపులు చేశామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని తెలిపారు. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో నిజామాబా ద్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, శ్రావణి, గంగాధర్, కలెక్టరేట్ ఎన్నికల విభా గం పర్యవేక్షకుడు బాలరాజు, గుర్తింపు పొందిన రా జకీయ పార్టీల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
రిజర్వేషన్లు ఖరారు


