నవీపేట–బాసర డబుల్ లైన్ పూర్తి
● రేపు నూతన రైల్వేట్రాక్ పరిశీలన
నవీపేట: మేడ్చల్ నుంచి ముద్ఖేడ్ వరకు రైల్వేలైన్ విస్తరణలో భాగంగా మొదటి విడ త పనులు పూర్తయ్యాయి. బాసర నుంచి న వీపేట వరకు ముందుగా పనులను ప్రారంభించిన రైల్వే అధికారులు రైల్వే డబ్లింగ్, వి ద్యుత్ సౌకర్యం, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులను పూర్తి చేశారు. దీంతో ఈ నెల 19న రైల్వే ఉన్నతాధికారులు, సంబంధిత శాఖ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో పరి శీలించనున్నారు. పరిశీలన అనంతరం ట్ర యల్ రన్‌ను పూర్తి చేసి, కొత్త పట్టాలపై మరిన్ని రైళ్ల రాకపోకలను కొనసాగించేందు కు ఏర్పాట్లు చేశారు. వారంలోగా కొత్తట్రాక్ పూర్తిగా వినియోగంలోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
ఆర్మూర్‌టౌన్: మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్‌కు ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలను ఉ న్నతాధికారులు అప్పగించారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ పూజారి శ్రావణి ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. కాగ ఆమె ఫౌండేషన్ కోర్సు ట్రెయినింగ్ కో సం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ 45 రో జుల పాటు ఆమె శిక్షణలో పాల్గొననున్నారు. దీంతో మున్సిపల్ మేనేజర్ ఇన్‌చార్జి కమి షనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
సుభాష్‌నగర్: మేడారం వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ కార్గో ద్వారా కేవలం రూ.299లకే మేడారం సమ్మక్క–సారక్క ప్రసాదం ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. నగరంలోని ఆర్‌ఎం కార్యాలయంలో శనివారం సమ్మక్క–సారక్క ప్రసాదం పంపిణీ కరపత్రాలను డిపో మేనేజర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమ్మక్క–సారక్క ప్రసాదం ఇంటికి తెచ్చి ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి www. tgsrtclogistics. co. in అనే వెబ్‌సైట్ ద్వారా, లేదా ఆర్‌టీసీ కార్గో నిజామాబాద్ కౌంటర్ వద్ద కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని ఉ మ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భ క్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపా రు. పూర్తి వివరాలకు ఆయా డిపోల ఫోన్‌నంబర్లను సంప్రదించాలని సూచించారు.
కలెక్టర్‌ను కలిసిన
ఆర్టీసీ ఆర్‌ఎం
సుభాష్‌నగర్: కలెక్టర్ ఇలా త్రిపాఠిని టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ టీ జ్యోత్స్న శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఆర్టీసీ బస్సు రవాణా వ్యవస్థ, ప్రజలకు మెరుగైన సేవలు, ప్రయాణికుల భద్ర త, రవాణా సౌకర్యాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ప్రధానంగా పండుగ సమయాల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. వారి వెంట నిజామాబాద్–1 డిపో మేనేజర్ ఆనంద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బీపీఎడ్ 1, 3వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 25న నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా జరుగుతాయన్నారు.
ఆర్మూర్ 7396889496
బోధన్ 9154298729.
నిజామాబాద్ –1 9154298727
నిజామాబాద్ –2 7396889496
బాన్సువాడ 9154298729
కామారెడ్డి 9154298729
నిజామాబాద్ ఆర్‌ఎం 8639963647
నవీపేట–బాసర డబుల్ లైన్ పూర్తి


