రిజర్వేషన్లపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
● దళితులు, మహిళలు, బీసీలకు
తీరని అన్యాయం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్
సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ వారీగా రిజర్వేషన్ల కేటాయింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి పేర్కొ న్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ అర్వింద్ ధర్మపురి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో మున్సిపాలిటీల రిజర్వేషన్ల లక్కీ డ్రా నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డారు. కార్పొరేషన్‌లో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీ నాయకులు దళితులు లేని 39, 40, 44 డివిజన్లను ఎస్సీలకు కేటాయించారని, ఈ విషయమై కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు వ్యతిరేకించా యని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో చేశామని చెప్పి.. లక్కీ డ్రా తీయడంతో మళ్లీ ఆ డివిజన్‌కే మహిళా రిజర్వేషన్లు వచ్చాయన్నారు. గత ఎన్నికల్లో మహిళలకు 29 డివిజన్లను కేటాయించారని, ప్రస్తుతం కూడా లక్కీ డ్రాలో మళ్లీ ఆ డివిజన్లు మహిళలకే కేటాయించబడ్డాయన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందువులపై కపట ప్రేమ చూపించిందని, బీసీలకు 24 సీట్లు కేటాయిస్తే అందులో 8 డివిజన్లు మైనార్టీలు గెలిచే స్థానాలకు ఇచ్చారని విమర్శించారు. ఆర్మూర్, బోధన్‌లో కూడా ఇలాగే అ న్యాయం జరిగిందన్నారు. అధికారుల తప్పిదాలను నిరసిస్తూ రిజర్వేషన్ల పత్రాలపై సంతకాలు పెట్టకుండా బహిష్కరించామని, సరిచేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయ ణ, బంటు రాము, శ్రీనివాస్‌రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, రాజు, ముస్కె సంతోష్, బైకన్ చిన్న ఒడ్డెన్న, విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


