ఈ పంటకు..రైతు నిర్ణయించిందే ధర | - | Sakshi
Sakshi News home page

ఈ పంటకు..రైతు నిర్ణయించిందే ధర

Jan 17 2026 7:28 AM | Updated on Jan 17 2026 7:28 AM

ఈ పంట

ఈ పంటకు..రైతు నిర్ణయించిందే ధర

మోర్తాడ్‌(బాల్కొండ): ప్రకృతి సాగును నమ్ముకున్న రైతులు.. వారు పండించిన పంటకు వారే ధరను నిర్ణయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాగులో ప్రకృతి సిద్ధంగా లభించిన ఎరువులను వాడి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో పంటను విక్రయిస్తూ లాభా లు పొందుతున్నారు. మోర్తాడ్‌ మండలం శెట్‌పల్లికి చెందిన గంజాల అశోక్‌, మోర్తాడ్‌లోని కస్ప ల క్ష్మీనర్సయ్య ఏళ్లుగా ప్రకృతి పరంగానే పసుపును సాగు చేస్తున్నారు. అశోక్‌ రెండున్నర ఎకరాల్లో, లక్ష్మీనర్సయ్య ఒక ఎకరం విస్తీర్ణంలో పసుపును పండిస్తున్నారు. గోమూత్రం, గోపే డ, పల్లిపిండిలను వినియోగించి సాగు చేయడంతో శ్రమకు తగిన ఫలితం లభిస్తోంది. పంటలో గడ్డి పెరిగితే సాధారణంగా మందును స్ప్రే చేస్తారు. ఈ ఇద్దరు రైతులు మాత్రం కూలీలతోనే గడ్డిని కోయిస్తున్నారు. పసుపు దిగుబడి ఒక్కో ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ల వరకు లభిస్తోంది. గత సీజన్‌లో లక్ష్మీనర్సయ్య తన పసుపును క్వింటాలుకు రూ.18 వేల చొప్పున కర్ణాటక, హైదరాబాద్‌లలోని వ్యాపారులకు విక్ర యించాడు. అశోక్‌ మాత్రం పసుపు కొమ్ములను కాకుండా పొడిని పట్టించి సొంతంగానే మార్కెటింగ్‌ చేసుకున్నాడు. క్వింటాలు పసుపు పొడిని రూ. 25 వేలకు విక్రయించాడు. సాధారణ పసుపు పొడికి మార్కెట్‌లో క్వింటాలుకు రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతుంది. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు ప్రభుత్వం సర్టిఫికెట్‌ జారీ చేయడంతో వీరి పసుపు పంట, పొడిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

పసుపు కొమ్ములు

ఎంతో సంతోషంగా ఉంది..

భూసారాన్ని పరిరక్షించడంతోపాటు ప్రజలకు ఆరోగ్యం అందించే ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. మేము పండించిన పసుపును మేము నిర్ణయించిన ధరకే విక్రయించడంతో ఆదాయం పెరిగింది. ఎంతో మంది పోటీపడి మా పసుపును కొనుగోలు చేస్తుండటం సంతృప్తినిచ్చింది.

– గంజాల అశోక్‌, రైతు, శెట్‌పల్లి

సాగు విస్తీర్ణం పెంచుతాం..

గతేడాది పసుపును ఇతర రైతుల కంటే ఎక్కువ ధరకు విక్రయించాం. పసుపు బోర్డు జాతీయ కార్యదర్శి భవానీ శ్రీ సహకారంతో క్వింటాలుకు రూ.18 వేల ధర లభించింది. ఇదే స్ఫూర్తి సాగు విస్తీర్ణం పెంచుతాం.

– కస్ప లక్ష్మి నర్సయ్య, రైతు, మోర్తాడ్‌

ఆదాయం పెరుగుతుంది...

సేంద్రియ పద్ధతిలో సాగు ప్రారంభించిన వీరికి మొదట్లో ఆశించిన దిగుబడి రాకపోయినా రానురాను పెరుగుతూ వచ్చింది. రసాయనాల వినియోగంతో సాగు చేసిన పసుపును విక్రయించే ఒక్కో రైతుకు రూ.2.34 లక్షల వరకు ఆదాయం లభిస్తే ప్రకృతి పరంగా సాగు చేసినందుకు రూ.3.24 లక్షల నుంచి రూ.4.40 లక్షల వరకు ఆదాయం లభించింది. ఈసారి తాను పండించిన పసుపును పొడిగా మార్చి విక్రయించడానికి ఒక్కో క్వింటాలుకు రూ.30 వేల ధరను రైతు అశోక్‌ నిర్ణయించడం విశేషం. పసుపు సాగులో పూర్వపు పద్ధతిని అనుసరిస్తున్న ఈ రైతుల బాటలో ఇతర రైతులు నడిస్తే ప్రకృతికి మేలు చేసినవారవుతారని పలువురు పేర్కొంటున్నారు.

సేంద్రియ విధానంలో పసుపు సాగు

పసుపు కొమ్ములు, పొడికి డిమాండ్‌

క్వింటాలుకు రూ.18 వేల నుంచి

రూ.25 వేల వరకు ధర

కొనుగోలుకు ముందుకొస్తున్న వ్యాపారులు

లాభాలు సాధిస్తున్న కర్షకులు

ఈ పంటకు..రైతు నిర్ణయించిందే ధర 1
1/3

ఈ పంటకు..రైతు నిర్ణయించిందే ధర

ఈ పంటకు..రైతు నిర్ణయించిందే ధర 2
2/3

ఈ పంటకు..రైతు నిర్ణయించిందే ధర

ఈ పంటకు..రైతు నిర్ణయించిందే ధర 3
3/3

ఈ పంటకు..రైతు నిర్ణయించిందే ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement