తాగునీటి సమస్య తలెత్తొద్దు
● ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
● అదనపు కలెక్టర్ అంకిత్
నిజామాబాద్ అర్బన్: వచ్చే వేసవి కాలంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో శు క్రవారం మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవ రి 1వ తేదీలోపు అన్ని గ్రామాలలో మంచినీటి, పా రిశుద్ధ్య కమిటీలను ఏర్పాటు చేసుకొని నీటి సరఫరా తీరును నిశితంగా పరిశీలించాలన్నారు. ఫిబ్ర వరి 1 నుంచి 20వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఎంపీవో, మిషన్ భగీరథ ఏఈలు మండల స్థాయి బృందాలుగా ఏర్పడి అన్ని గ్రామాలలో సర్పంచ్, సెక్రెటరీలతో కలిసి వీధులలో పర్యటించి నీటి సమస్యలను గుర్తించి కార్యాచరణ ప్రణాలిక సిద్ధం చేయాలన్నారు. గ్రామాలలో నీటి సమస్య ఎదురైతే రాష్ట్రస్థాయి టోల్ ఫ్రీ నంబర్ 1916కు కాల్ చేసి అధికారుల దృష్టికి తీసుకురా వాలని ప్రజలకు సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాజశ్రీ, మిషన్ భగీరథ ఎస్‌ఈ రాజేందర్, ఈఈలు రాకేశ్, నరేశ్, స్వప్న, డీఎల్‌పీవోఎస్, డీఈఈఎస్, ఎంపీడీవో, ఎంపీవోలు పాల్గొన్నారు.


