ఘనంగా సంక్రాంతి సంబురాలు
ఆర్మూర్‌లో పతంగులతో యువకులు
కోటగల్లిలో పతంగులతో చిన్నారులు
నిజామాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి సంబురాలను గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ఇంటి ముంగిళ్లను రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. గొబ్బెమ్మలను పెట్టి పూజలు చేశారు. కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవతలకు సమర్పించారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం వేళలో యువతీయువకులు, చిన్నారులు ఒకరిని మించి ఒకరు ఇంటి డాబాలు, మైదానాలు, వీధుల్లో డీజే సౌండ్ల మధ్య ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు.
రంగవల్లులతో ఆకట్టుకున్న మహిళలు
పతంగులతో చిన్నారులు, యువత బిజీబిజీ
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ఘనంగా సంక్రాంతి సంబురాలు
ఘనంగా సంక్రాంతి సంబురాలు


