ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెంపొందించాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● రెంజల్ పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
రెంజల్ (బోధన్): ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంపొందించేలా మెరుగైన వైద్య సేవలందించి, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం సాయంత్రం రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్‌పేషంట్, ల్యాబ్, ఫార్మసీ, ఇమ్యునైజేషన్ గ దులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హా జరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలను ఆరా తీశారు. తనిఖీ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషంట్ల వివరాలతో కూడిన రిజిస్టర్‌ను పరిశీలించి, వారికి అందించిన ఔషధాలను గమనించారు. ప్రతిరోజు ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల సంఖ్య, స్థానికంగానే కాన్పులు చేస్తున్నా రా? అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డిస్పెన్సరీలో నిలువ ఉన్న ఔషధాల గడువు తేదీ, వాటి నాణ్యతను పరిశీలించారు. వైద్యు లు, సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని ఆదేశించారు.


