డ్రోన్‌తో ఆట కట్టించారు
● కోడి పందేలపై పోలీసుల నిఘా
వర్ని/రుద్రూర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిషేధిత కోడి పందేలను అరికట్టేందుకు పోలీసులు డ్రోన్ సహాయంతో నిఘా చేపట్టారు. వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, బోధన్ రూరల్, జైనాపూర్, హంగర్గ ఫారం, చేతనగర్, పోతంగల్, హంగర్గ, ఎత్తోండ, ఎక్లాస్‌పూర్ క్యాంపు తదితర ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా సాగుతాయన్న అనుమానంతో పోలీసులు గురు, శుక్రవారాల్లో డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు. దీంతో అప్రమత్తమైన పందెం రాయుళ్లు కోడి పందేలను విరమించుకున్నారు. అయితే, కోడి పందేలు జరిగే ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి వర్ని మండలం నుంచి సుమారు 250 మంది సంక్రాంతికి రెండ్రోజుల ముందే తరలి వెళ్లినట్లు సమాచారం. పేకాట, కోడి పందేలు వంటి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు.
నేడు మహిళా
రిజర్వేషన్ల ఖరారు
● జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు శనివారం మహిళా రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల డ్రా నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. భీంగల్ మున్సిపాలిటీకి ఉదయం 10 గంటలకు, ఆర్మూర్‌కు 10.15 గంటలకు, బోధ న్‌కు 10.30 గంటలకు, నిజామాబాద్‌కు సంబంధించిన రిజర్వేషన్లపై 11 గంటలకు డ్రా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. సమావేశానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ కోరారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సుభాష్‌నగర్: నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డు సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల నేపథ్యంలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–2 ఏడీఈ ఆర్ ప్రసాద్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్‌స్టేషన్ పరిధిలోని మారుతీనగర్, హౌసింగ్ బోర్డు, గంగస్థాన్, చంద్రశేఖర్ కాలనీ, బైపాస్ రోడ్డులో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
వెబ్‌సైట్‌లో ఎంఎల్‌హెచ్‌పీ అభ్యర్థుల జాబితా
సుభాష్‌నగర్: ఎంఎల్‌హెచ్‌పీ(మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, జాబితా, ప్రొవిజనల్ జాబితా, రిజెక్ట్ అభ్యర్థుల జాబితాను నిజామాబాద్.తెలంగాణ.గౌట్.ఇన్‌లో పెట్టినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రాజ శ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో ఎవరికై నా అభ్యంతరాలుంటే ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
హెల్మెట్ ఉంటేనే
కలెక్టరేట్‌లోకి ఎంట్రీ
నిజామాబాద్ అర్బన్: కలెక్టరేట్ కార్యాలయంలోకి హెల్మెట్ ధరించిన వాహనదారులకే ప్రవేశం లభిస్తుందని నిజామాబాద్ ఏసీ పీ రాజావెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ప్రవేశమార్గం వద్ద అవగాహన క ల్పించారు. ఉద్యోగులతోపాటు బయట వ్య క్తులు సైతం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది ఉద్యోగులు హెల్మెట్ ధరించకుండా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్, ఎస్సై షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.


