విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చూడాలి
డిచ్‌పల్లి: ఇంటర్‌లో విద్యార్థుల హాజరుశాతం పెరిగేలా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ ప్రత్యేకాధికారి ఒడ్డెన్న అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌పై అధ్యాపకులతో సమీక్షించారు. విద్యార్థుల హాజరుశాతం పెంచడంతో పాటు వివిధ ప్రవేశ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయాలని సూచించారు. అందుకు అధ్యాపకులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రిన్సిపాల్ చంద్రవిఠల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


