చలో నింబాచలం
న్యూస్‌రీల్
నిజామాబాద్
నగర మార్కెట్‌లో కార్తీక..
నిజామాబాద్ నగర మార్కెట్‌లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ఉసిరికొమ్మలు, పండ్లు, పూల విక్రయాలు జోరుగా సాగాయి.
బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025
– 8లో u
మోర్తాడ్/కమ్మర్‌పల్లి : దక్షిణ బద్రినాథ్‌గా కొలిచే నింబాచలం కొండపై ప్రతి యేటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు, రథోత్సవం, జాతర నిర్వహిస్తుండగా, ఈ ఏడాది సైతం వైభవంగా కొనసాగుతున్నాయి. లింబాద్రిగుట్టపై బుధవారం రథోత్సవం, జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధర్మకర్తలు, ఆలయ కమిటీ, ఆయా శాఖల అధికారులు, పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతేడాది రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో పోలీసుశాఖ ఈ ఏడాది అప్రమత్తమైంది. భీమ్‌గల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పొన్నం సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో దేవస్థానం పురోహితులతో చర్చించి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వన్ వే ద్వారా వాహనాల రాకపోకలను అనుమతించాలని నిర్ణయించారు. భీమ్‌గల్ నుంచి పురాణీపేట్ మీదుగా లింబాద్రి గుట్టకు చేరుకోవాల్సి ఉండగా, తిరిగి వెళ్లే భక్తులు గుట్టపై నుంచి పల్లికొండ, లింగాపూర్, సిద్ధపల్లె మీదుగా భీమ్‌గల్ చేసుకోవాలి. తిరిగి వెళ్లే భారీ వాహనాలు పల్లికొండ, పిప్రి, ముచ్కూర్, బెజ్జోర గ్రామాల మీదుగా భీమ్‌గల్ చేరుకోవాల్సి ఉంటుంది. సర్కిల్ పరిధిలోని పోలీసులతోపాటు ఇతర స్టేషన్‌ల నుంచి సిబ్బందిని బందోబస్తు కోసం లింబాద్రిగుట్టకు తరలించారు. అలాగే ప్రత్యేక పోలీస్ బలగాలను రప్పించారు. ముగ్గురు ఏసీపీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 400 మంది కానిస్టేబుళ్లు, ప్రత్యేక పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. రథోత్సవం, దైవదర్శనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
నేడు లింబాద్రిగుట్టపై
రథోత్సవం, జాతర
భారీ సంఖ్యలో
తరలిరానున్న భక్తజనం
ట్రాఫిక్ సమస్య
తలెత్తకుండా పోలీసుల
రూట్‌మ్యాప్
ప్రత్యేక బస్సులు
నడుపుతున్న ఆర్టీసీ
ప్రత్యేక బస్సులు
ఆర్మూర్‌టౌన్ : ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి లింబాద్రి గుట్ట జాతరకు ప్రత్యేక బస్సులు నడుపు తున్నట్లు మేనేజర్ రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని, పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.40 బస్సు చార్జీ ఉంటుందని తెలిపారు. ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చలో నింబాచలం
చలో నింబాచలం


