భక్తిశ్రద్ధలతో డోలోత్సవం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో డోలోత్సవం

Nov 5 2025 7:47 AM | Updated on Nov 5 2025 7:47 AM

భక్తిశ్రద్ధలతో డోలోత్సవం

భక్తిశ్రద్ధలతో డోలోత్సవం

పరవశించిన భక్తజనం

కమ్మర్‌పల్లి (భీమ్‌గల్‌) : నింబాచలం (లింబాద్రిగుట్ట)పై మంగళవారం రాత్రి స్వామి వారి డోలోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లక్మీనృసింహుని డోలోత్సవ మధుర ఘట్టాన్ని తిలకించిన భక్తజనం ఆనంద పరవశంలో మునిగితేలింది. స్వామి వారి ఆలయానికి పశ్చిమ వైపున ఉన్న జోడు లింగమునకు వెళ్లే దారిలో ఉన్న సీతానగరంలోని నాలుగు స్తంభాల రాతి మందిరంలో డోలో త్సవం చేపట్టారు. లక్ష్మీనరసింహ ఉత్సవ మూర్తులను పల్లకీలో వేద మంత్రోచ్ఛారణ ల నడుమ భాజా భజంత్రీలు మేళతాళాలతో మండపానికి తీసుకువచ్చి కార్యక్రమం జరిపారు. తిరుగు ప్రయాణంలో జోడులింగాలకు ఎదురుగా నిలిపి శ్రీలక్ష్మీనరసింహుని నుంచి జోడు లింగముల దర్శనం చేసుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం పరిశీలన

నిజామాబాద్‌అర్బన్‌ : జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును కలెక్టర్‌ టి వినయ్‌ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా గోదాముకు వెళ్లిన ఆయన సీల్‌లను పరిశీలించారు. పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట నిజామాబాద్‌ ఫైర్‌ ఆఫీసర్‌ శంకర్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్‌, సిబ్బంది సాత్విక్‌, విజయేందర్‌రెడ్డి ఉన్నారు.

జిల్లాకు కొత్తగా

నలుగురు ఎంపీవోలు

సుభాష్‌నగర్‌ : జిల్లాకు నలుగురు మండల పరిషత్‌ అధికారులను (ఎంపీవో) ప్రభు త్వం కేటాయించింది. ఇటీవల విడుదలైన గ్రూప్‌–2 పరీక్షల్లో పాసై ఎంపీవోలుగా సెలె క్ట్‌ అయిన వై వేణు, ఎన్‌ అజయ్‌కుమార్‌, పి బాలమణి, ఎం అరవింద్‌కుమార్‌ను జిల్లాకు కేటాయించారు. కాగా జిల్లాలో మాక్లూర్‌, రు ద్రూర్‌, నందిపేట్‌, బోధన్‌ మండలాల్లో ఎంపీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

రుణాల రికవరీపై

దృష్టి సారించాలి

డీఆర్‌డీవో సాయాగౌడ్‌

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌) : మహిళా సంఘాల స భ్యులకు రుణాలు అందించడం ఎంత ము ఖ్యమో, రికవరీ చేయడం కూడా అంతే ము ఖ్యమని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికా రి సాయాగౌడ్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని జిల్లా కార్యాలయంలో జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. బ్యాంకు లింకేజీలో రూ.1,228 కోట్ల లక్ష్యానికి గాను రూ. 767.48 కోట్ల రుణాలు అందజేసినట్లు తెలిపారు. సీ్త్రనిధిలో రూ.246 కోట్లకు గాను రూ. 107.37 కోట్లు ఇచ్చామన్నారు. లోన్‌ బీమా, ప్రమాద బీమా పొందిన సభ్యులు ఇప్పటి వరకు 389 మంది మరణిస్తే 27మందికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఖాతాల్లో బీ మా డబ్బులు వేశామన్నారు. ఐకేపీ ద్వారా జిల్లాలో 266 సెంటర్లలో వడ్ల కొనుగోళ్లు జ రుగుతున్నట్లు తెలిపారు. ఏపీడీ మధుసూదన్‌, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు.

శ్రీరామసాగర్‌కు 47 ఏళ్లు..

1978లో పేరు మార్చిన

నాటి సీఎం మర్రి చెన్నారెడ్డి

బాల్కొండ: పోచంపాడ్‌ ప్రాజెక్టు పేరును శ్రీ రామసాగర్‌గా మార్చి బుధవారంతో 47 ఏ ళ్లు పూర్తయ్యింది. 48వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు పేరు మొదట పోచంపాడ్‌గా ఉండేది. 1978 నవంబర్‌ 5వ తేదీన ప్రాజెక్టును సందర్శించేందు కు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వ చ్చారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీలో ని వాసం ఉండే ఉద్యోగులు మర్రి చెన్నారెడ్డితో మాట్లాడుతూ.. సాగు, తాగునీటిని అందిస్తు న్న అతి పెద్ద ప్రాజెక్ట్‌ను పోచం‘పాడ్‌’గా పిలవడం బాగొలేదన్నారు. పవిత్ర గోదావరి తీ రాన శ్రీరామాలయం నెలకొల్పినందున శ్రీరామసాగర్‌గా పేరు పెట్టాలని కోరారు. స్పందించిన చెన్నారెడ్డి పోచంపాడ్‌ పేరును శ్రీరామసాగర్‌గా మారుస్తున్నట్లు ప్రకటించా రు. అలాగే ప్రాజెక్ట్‌ నుంచి నీటిని సరఫరా చేసే ప్రధాన కాలువల పేర్లను సైతం మా ర్చారు. హైలెవల్‌ కాలువ పేరును లక్ష్మి కాలువగా, దక్షిణ కాలువగా పిలిచే కాలువ పేరును కాకతీయ కాలువగా, ఉత్తర కాలువ గా పిలుచుకునే కాలువ పేరును సరస్వతి కాలువగా మార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement