జిల్లా నేతల జూబ్లీ బాట
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో హోరాహోరీగా జరుగుతు న్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారంలో ఇందూరు జిల్లా నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరుగనున్న నే పథ్యంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికలను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్ట్త్మాకంగా తీసు కున్నాయి. దీంతో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలకు ఆయా పార్టీలు కీ లకమైన ప్రచార బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యేల నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులు తమకు అప్పగించిన ప్రాంతాల్లోనే తిష్ట వేసి ప్రచారంలో తిరుగుతున్నారు. అక్కడే మకాం వేసి తీరిక లేని షెడ్యూల్‌తో బిజీబిజీగా గడుపుతున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో తమకు సన్నిహితులైనవారి ఇళ్లలో జరి గే శుభకార్యాలకు సైతం హాజరు కాకుండా ప్ర చారంలో పార్టీ తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
● కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మె ల్యే డాక్టర్ భూపతిరెడ్డికి ఎర్రగడ్డ డివిజన్‌లో ప్రచార బాధ్యతలు అప్పగించారు. భూపతిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలందరూ ప్రచారంలో ఉన్నారు. మరోవైపు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్‌రెడ్డి, సుంకేట అన్వేష్‌రెడ్డి, తాహెర్‌బిన్ హందా న్, ఈరవత్రి అనిల్, నుడా చైర్మన్ కేశ వేణు సమ న్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇక పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మ న్ ముప్ప గంగారెడ్డి, వెల్మ భాస్కర్ రెడ్డి, మోపా ల్ సాయిరెడ్డిలు ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నారు. బూత్‌ల వారీగా ప్రతి ఓటరును కలిసే లా ప్లాన్ చేసుకున్నారు.
● బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి షేక్‌పేట డివిజన్ ఇన్‌చార్జిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్‌గానూ ప్రచారం చేస్తున్నా రు. ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది క్లస్టర్ ఇ న్‌చార్జులు పనిచేస్తున్నారు. ఈ క్లస్టర్ ఇన్‌చార్జు ల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. అదేవిధంగాా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే లు షకీల్, గణేశ్ గుప్తా, జీవన్‌రెడ్డి, సురేందర్ ఉ న్నారు. షకీల్ భార్య ఆయేషా ఫాతిమా సైతం ప్రచారంలో ఉన్నారు. బూత్‌ల వారీగా లెక్కలే సుకుని ప్రచారం చేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువమంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొని ఓటుహక్కు వినియోగించుకునేవిధంగా ప్రశాంత్‌రెడ్డి మోటివేట్ చేస్తున్నారు.
● బీజేపీ నుంచి ఎంపీ ధర్మపురి అర్వింద్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా రహమత్‌నగర్ డివిజన్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లా అ ధ్యక్షుడు కులాచారి దినేష్ షేక్‌పేట డివిజన్‌లోని శక్తికేంద్రం సమన్వయకర్తగా పనిచేస్తున్నారు.
తీరికలేని షెడ్యూల్‌తో హోరాహోరీగా మూడు పార్టీల నాయకుల ప్రచారం
ఎమ్మెల్యేల నుంచి ప్రథమ, ద్వితీయ,
తృతీయ శ్రేణి నాయకుల వరకు
అక్కడే తిష్ట
సన్నిహితుల శుభకార్యాలకు సైతం హాజరు కాకుండా బిజీబిజీగా..
జిల్లా నేతల జూబ్లీ బాట
జిల్లా నేతల జూబ్లీ బాట


