సమయపాలన పాటించాలి
బోధన్‌టౌన్(బోధన్): అధ్యాపకులు, సిబ్బంది సమయపాలన పాటించాలని డీఐఈవో తిరుమలపుడి రవికుమార్ అన్నారు. బోధన్‌లోని పలు జూనియర్ కళాశాలలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా వినాలని సూ చించారు. అధ్యాపకులు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. రానున్న వార్షిక పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించేందుకు ప్రత్యేక తరగతుల ను నిర్వహించాలని, వెనకబడిన విద్యార్థులపై ప్ర త్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందిని ఆదేశించారు. కా ర్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


