కేదారీశ్వర ఆశ్రమంలో జాతర
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రానికి సమీపంలోగల కేదారీశ్వర ఆశ్రమం కార్తీక పౌర్ణమి సందర్బంగా జాతరకు ముస్తాబయింది. ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ గత 40 సంవత్సరాలుగా ప్రతియేటా దసరా పర్వదినాన దీక్ష బూని కార్తీక పౌర్ణమి రోజున విరమించడం ఆనవాయితీ. ఈయేడు కూడా దసరా రోజున దీక్ష చేపట్టిన స్వామీజీ నేడు దీక్ష విరమించనున్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆశ్రమంలో జాతర, భక్తులకు అన్నదానం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆశ్రమ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.


