ఎస్సారెస్పీకి తగ్గిన వరద | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీకి తగ్గిన వరద

Nov 5 2025 8:11 AM | Updated on Nov 5 2025 8:11 AM

ఎస్సా

ఎస్సారెస్పీకి తగ్గిన వరద

ఎస్సారెస్పీకి తగ్గిన వరద ముప్కాల్‌లో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు జాతీయస్థాయి క్రీడాకారుడికి సన్మానం

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం ప ట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి 21,954 క్యూ సెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్‌ నుంచి గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్‌ అధికారులు తగ్గించారు. గోదావరిలోకి 4 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీటి ని వదులుతున్నారు. ప్రాజెక్ట్‌ నుంచి సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, ఎస్కెప్‌ గే ట్ల ద్వారా 8వేల క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్‌ పూ ర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులతో నిండుకుండలా ఉంది.

బాల్కొండ: ముప్కాల్‌లోని భూదేవి ఇండోర్‌ స్టేడియంలో మంగళవారం ఎస్‌జీఎఫ్‌ జిల్లాస్థా యి బాలబాలికల కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఇందులో జోనల్‌స్థాయి కబడ్డీ జట్లు పా ల్గొనగా, పోటీలు రసవత్తరంగా సాగాయి. అంతకుముందు పోటీలను కబడ్డీ అసోషియేషన్‌ జిల్లా అధ్యక్షుడు లింగయ్య, ప్రధాన కార్యదర్శి గంగాధర్‌ ప్రారంభించారు. నాయకులు ము స్కు మోహన్‌, ముస్కు నర్సయ్య, శ్రీనివాస్‌, పీడీ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖలీల్‌వాడి: డిచ్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థి వి స్లావత్‌ సిద్ధు ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌–17 వెయిట్‌ లిఫ్టింగ్‌ (65 కేజీల విభాగం) పోటీల్లో మొదటి స్థానం సాధించి జాతీ యస్థా యి పోటీలకు ఎంపికయ్యారు. ఈసందర్భంగా క్రీడాకారుడిని మంగళవారం జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్‌లోగల డీఈవో కార్యాలయంలో డీ ఈవో అశోక్‌ సన్మానించారు. డీసీఈబీ సెక్రెటరీ, హెచ్‌ఎం సీతయ్య, పీడీ స్వప్న, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

వరద నీటిలో మునిగిన వడ్ల ట్రాక్టర్‌

డ్రైవర్‌ను కాపాడిన గ్రామస్తులు

నిజాంసాగర్‌/బిచ్కుంద: బిచ్కుంద మండలం చిన్నదేవాడ శివారులోని వాగులో ధాన్యం త రలిస్తున్న ట్రాక్టర్‌ మునిగి పోగా.. డ్రైవర్‌ను గ్రా మస్తులు కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొందరు రైతులు మంగళ వారం సాయంత్రం గ్రామ శివారు నుంచి ట్రా క్టర్‌లో వడ్లను ఇంటికి తరలిస్తున్నారు. ఈ క్ర మంలో వాగు దాటుతుండగా ఒక్కసారిగా వర ద ప్రవాహం పెరిగింది. దీంతో వరద నీటిలో ట్రాక్టర్‌ మునిగింది. తాడు సహాయంతో గ్రామస్తులు ట్రాక్టర్‌ డ్రైవర్‌ను వాగులో నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఎలాంటి స మాచారం ఇవ్వకుండానే కౌలాస్‌నాలా ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారని రైతులు ఈ సందర్భంగా ఆరోపించారు. బిచ్కుందలోని గోపన్‌పల్లి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. నీటి ప్రవాహంలో ట్రాక్టర్‌లో వడ్లు, ట్రాక్టర్‌కు నష్టం వాటిల్లిందని, ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు పోయేపరిస్థితి వచ్చిందని రైతులు ఆ గ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ వేణుగోపా ల్‌ రైతుల వద్దకు చేరుకుని విషయాన్ని ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, పరిహారం వచ్చేలా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

ఎస్సారెస్పీకి తగ్గిన వరద 
1
1/2

ఎస్సారెస్పీకి తగ్గిన వరద

ఎస్సారెస్పీకి తగ్గిన వరద 
2
2/2

ఎస్సారెస్పీకి తగ్గిన వరద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement