గూప్–1లో జిల్లావాసుల సత్తా
నిజామాబాద్ సిటీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూ ప్–1 జనరల్ ర్యాంకులను వి డుదల చేయగా జిల్లావాసులిద్ద రు సత్తాచాటారు. నిజామాబా ద్ నగరానికి చెందిన కడావత్ రోజాబాయికి 206వ ర్యాంకు దక్కింది. 472 మార్కులు సాధించిన ఆమె.. జనరల్ కోటాలో 206వ ర్యాంకు, మల్టీ జోన్–1 ఎస్టీ (జనరల్) కోటాలో 6వ, ఎస్టీ మహిళల విభాగంలో 2వ ర్యాంకు సాధించారు. రోజాబాయి వ్యవసా యం మీద అభిమానంతో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యా లయంలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేశారు. ఇప్పటికీ నాలుగుసార్లు గ్రూప్స్ రాసిన రోజాబాయి గ్రూప్–2లో 323 మార్కులు, గ్రూప్–3లో 258, గ్రూప్–4లో 151 మార్కులు సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించిన వార్డు ఆఫీసర్ పోస్టుకు ఎంపికై న రోజాబాయి ప్రస్తుతం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పని చేస్తున్నారు.
ఆనంద్‌కు మరో ర్యాంక్..
నిజామాబాద్‌నాగారం: కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌కు చెందిన మాదరి ఆనంద్ గ్రూప్ – 1 జనరల్ ర్యాంకింగ్‌లో 658వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్.. గతంలో విడుదలైన గ్రూప్–2లో బీసీ–సీ కేటగిరిలో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంక్, గ్రూప్–3లో బీసీ–సీ కేటగిరిలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.
మున్సిపల్ వార్డ్ ఆఫీసర్
రోజాబాయికి 206వ ర్యాంక్
వాణిజ్య పన్నుల శాఖ జూనియర్
అసిస్టెంట్‌కు 658..
గూప్–1లో జిల్లావాసుల సత్తా


