పుర రిజర్వేషన్లు ఖరారు!
న్యూస్‌రీల్
నిర్మల్
19 నుంచి నిర్మల్ ఉత్సవాలు
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఎన్టీఆర్ స్టేడియం సుందరీకరణ పనులు, ఇతర ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజులపాటు నిర్మల్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. గతేడాది నిర్మల్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందామన్నారు. నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని నిర్మల్ ఉత్సవాల వేదిక ద్వారా ఆవిష్కరించామని, ఈ సంవత్సరం కూడా రెట్టించిన ఉత్సాహంతో అధికారులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. మరుగుదొడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని, హెల్మెట్ ధరించి, నిర్మల్ ఉత్సవాలకు హాజరయ్యే ద్విచక్ర వాహనదారులకు పార్కింగ్ రుసుము పూర్తిగా మినహాయించాలని తెలిపారు. ఉత్సవాలకు ప్రొటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానాలు అందించాలన్నారు. ఉత్సవాల విజయవంతానికి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, డీవైస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఓటరు తుది జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటన తర్వాత రిజర్వేషన్లపై అధికారులు కసరత్తు చేశారు. సీపెక్ సర్వే జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల వార్డుల మహిళా రిజర్వేషన్లను కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఖరారు చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వార్డులవారీగా కేటాయించిన రిజర్వేషన్ల వివరాలు తెలుపుతూ, లాటరీ పద్ధతి ద్వారా ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ వారీగా మహిళలకు కేటాయించే వార్డులను ఎంపిక చేశారు. ప్రక్రియ మొత్తం వీడియోగ్రాఫ్ పర్యవేక్షణలో నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, సుందర్‌సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్మల్ పీఠం జనరల్ మహిళకు..
నిర్మల్‌చైన్‌గేట్/భైంసాటౌన్/ఖానాపూర్: మున్సిపాలిటీల వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 80 వార్డులు ఉన్నాయి. రొటేషన్ పద్దతిలో ఈ రిజర్వేషన్లు ఫై నల్ అయ్యాయి. నిర్మల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీ టం ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. ని ర్మల్‌లో 42 వార్డులకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఇ క భైంసా, ఖానాపూర్ పుర పీఠాలు జనరల్‌కు రిజ ర్వు చేశారు. భైంసాలో 26 వార్డులకు రిజర్వేషన్లు పూర్తి చేశారు. ఖానాపూర్ బల్దియాలో 12 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. నిర్మల్, ఖానాపూర్‌లో ఎస్టీ జనరల్‌కు ఒక్కోటి కేటాయించారు.
ఆయనకు మార్గం సుగమం..
గతంలో రెండు పర్యాయాలు భైంసా మున్సిపల్ పీటం బీసీ మహిళకు కేటాయించారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఎంఐఎం నుంచి సబియాబేగం చైర్‌పర్సన్‌గా పదవిలో కొనసాగారు. పార్టీకి అన్నీ తానైన మహ్మద్ జాబీర్ అహ్మద్ వైస్ చైర్మన్‌గా కొనసాగారు. ఈయన రెండుసార్లు మున్సిపల్ చైర్మన్‌గా, రెండుమార్లు వైస్ చైర్మన్‌గా కొనసాగారు. గడిచిన రెండు పర్యాయాలు రిజర్వేషన్ కారణంగా వైస్ చైర్మన్ పదవికే పరిమితమయ్యారు. ఈసారి చైర్మన్ పీఠం జనరల్‌కు రావడంతో ఆయనకు మార్గం సుగమమైంది. ఇక, బీజేపీ నుంచి సైతం మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్ చైర్మన్ బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. అధికార కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్ సైతం ఈసారి మున్సిపల్ బరిలో తమ అభ్యర్థులను నిలుపనుంది.
ఖానాపూర్ పీఠం జనరల్‌కే..
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని జనరల్(అన్ రిజర్వ్‌డ్) వర్గానికి కేటాయిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు గత ఎన్నికల్లో బీసీ జనరల్‌కు కేటాయించారు. రొటేషన్‌లో భాగంగా ఈసారి జనరల్‌కు దక్కింద. ఈ క్రమంలో పోటీ హోరాహోరీగా సాగనుంది.
మున్సిపల్ రిజర్వేషన్లు..
మున్సిపాలిటీ జనరల్ జనరల్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ
మహిళ జనరల్ మహిళ జనరల్ జనరల్ మహిళ
నిర్మల్ 09 12 02 01 01 09 08
భైంసా 05 08 02 01 –– 05 04
ఖానాపూర్ 02 04 01 01 01 02 01


