నిర్మల్
బాసర ట్రిపుల్‌ఐటీలో యూనివర్సిటీ
ఓవర్ టు మర్రిచెట్టు
నాగోబా మహాపూజకు అవసరమయ్యే పవిత్ర గంగాజలంతో తిరుగు పయనమైన మెస్రం వంశీయులు ఆదివారంమర్రి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు కొనసాగించన్నారు.
నిర్మల్ సభా వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బొజ్జు, కలెక్టర్ అభిలాష అభినవ్
నా జిల్లాతో సమానంగా అభివృద్ధి
సీఆర్‌ఆర్, నర్సన్నబాపుల పేర్లు..
సీనియర్ నేతలుగా, తమప్రాంతాలను అభివృద్ధి చేసినవారిగా ప్రజల్లో నిలిచిన మాజీమంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి(నర్సన్నబాపు), ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే సి.రాంచంద్రారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. చనాక–కొరాట పంప్‌హౌస్‌కు రాంచంద్రారెడ్డి పేరు, సదర్మాట్ బ్యారేజీకి పి.నర్సారెడ్డి పేర్లు పెడుతున్నట్లు నిర్మల్ సభావేదిక మీదుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఆదిలాబాద్‌లో అతిపెద్ద పారిశ్రామికవాడ
ఉమ్మడి జిల్లాకు సీఎం వరాలు
సీఆర్‌ఆర్, నర్సన్నబాపులకు గుర్తింపు
నిర్మల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆదిలాబాద్‌లో అతిపెద్ద పారిశ్రామికవాడ
ఎర్రబస్సు కూడా రాని గూడేలు ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్ బస్సు తీసుకువస్తున్నామని, త్వరలోనే ఎయిర్‌పోర్టును పూర్తిచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎయిర్‌పోర్టు, యూనివర్సిటీలు ఉంటే సరిపోదని, ఈప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, వేలాదిమందికి ఉపాధి లభించాలన్నా పరిశ్రమలు అవసరమని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 10 వేల ఎకరాలతో అతిపెద్ద పారిశ్రామికవాడను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దేశంలోని ప్రతీ పరిశ్రమ ఇక్కడ ఉంటుందన్నారు. ఆదిలాబాద్‌లో త్వరలోనే ప్రధాని మోదీతో ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయిస్తామని తెలిపారు. ఎయిర్‌పోర్టు, పరిశ్రమలతోపాటు ఆదిలాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు పక్కాప్రణాళికతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
నిర్మల్
నిర్మల్


