సీఎం సభ జనసమీకరణలో బల్దియా అధికారులు?
ఖానాపూర్: సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవంతోపాటు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సీఎం బహిరంగ సభకు అధికారులే దగ్గరుండి జనసమీకరణ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఖానాపూర్ స్థాని క మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే పలువురు అధికారులు, సిబ్బంది దగ్గరుండి సభకు వెళ్లే వాహనాలకు సిద్ధం చయించారని, డీజిల్‌కు టోకెన్లు సైతం పంపిణీ చేశారని బీజేపీ పట్టణ అధ్యక్షులు కీర్తి మనోజ్ ఆరోపించారు. మహిళ సంఘాల సభ్యులను తప్పకుండా రావాలని, పలువురు అధికారులు, సిబ్బంది భయపెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వం జనసమీకరణ కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించా రు. ఈ విషయమై మున్సిపల్ సిబ్బందిని పలువురు మీడియా ప్రతినిదులు ప్రశ్నించగా, సీఎం సభకు వాహనాలకు డీజిల్ పోయిస్తున్నామని, అవి ప్రభుత్వం నుంచి వచ్చిన టోకెన్లే అని తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సుందర్‌సింగ్‌ను వివరణ కోరగా, అధికారిక కార్యక్రమం అయినందున మెప్మా సిబ్బందితోపాటు స్వయం సహాయక సంఘాల సభ్యులను తరలించడానికి టోకెన్లు పంపిణీ చేశామని తెలిపారు.
సీఎం సభ జనసమీకరణలో బల్దియా అధికారులు?


