అలరించిన సంక్రాంతి కవి సమ్మేళనం
నిర్మల్‌ఖిల్లా: తెలుగువారి సంస్కృతిలో సంక్రాంతి పండగ విశిష్టమైనదని, ఇలాంటి పండగలు హైందవ సంస్కృతికి ప్రతిరూపాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మకర సంక్రాంతి పురస్కరించుకుని నిర్మల భారతి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీయూ సంఘ భవనంలో సంక్రాంతి వైభవం పేరిట గురువారం జిల్లాస్థాయి సంక్రాంతి కవిసమ్మేళనం నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు కవులు, కళాకారులు పాల్గొని తమ కవితలు, పాటలద్వారా పండగ యొక్క ఔన్నత్యాన్ని, పౌరాణిక ప్రాశస్త్యాన్ని, పండగకు ప్రకృతికి మధ్య సంబంధాన్ని వివరించారు. అనంతరం కవులను, గాయకులను నిర్మల భారతిపక్షాన సన్మానించారు. నిర్మలభారతి అధ్యక్ష్య ప్రధాన కార్యదర్శులు తొడిశెట్టి పరమేశ్వర్, పద్యకవి బి.వెంకట్, సంయుక్త కార్యదర్శులు అంబటి నారాయణ, యార సాయినాథ్‌రెడ్డి, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు నేరెళ్ల హనుమంతు, వైద్యులు దామెర రాములు, మురళీధర్, కృష్ణంరాజు, వేణుగోపాలకృష్ణ, కవులు చట్ల గజ్జారాం, పోలీస్ భీమేశ్, పాటే మా ప్రాణం సంగీత అకాడమీ డైరెక్టర్ చెనిగారం నాగరాజు, వెన్నెల డాన్స్ అకాడమీ డైరెక్టర్ ధనరాజ్, గాయకురాలు సాయిప్రియ, కవియాత్ర చైర్మన్ కారం నివేదిత, కలం స్నేహం జిల్లా అధ్యక్షురాలు దేవిప్రియ, కారం ప్రణతి, భిక్షపతి నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


