వ్యవసాయానికి పెద్దపీట వేయాలి..
సాగుపై ఆధారపడిన నిర్మల్ జిల్లాలో వ్యవసాయానికి పెద్దపీట వేయాలని బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి కోరారు. చెరువుల జిల్లాగా పేరొందిన నిర్మల్‌లో చెరువులను కాపాడాలన్నారు. స్వర్ణ ప్రాజెక్టు గేట్లు, స్పిల్‌వే, కాలువలు, సరస్వతీ కాలువ దెబ్బతిన్నాయన్నారు. కాళేశ్వరం ప్యాకేజీల పనులు పూర్తిచేయాలని కోరారు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న కలెక్టరేట్‌ను జిల్లాకేంద్రానికి మార్చాలని, మాస్టర్‌ప్లాన్ రద్దుచేయాలని, మున్సిపాలిటీలకు నిధులివ్వాలని, చెరువుల ఆక్రమణలను ఆపాలని, యంగ్ ఇండియా స్కూల్ ఇవ్వాలని కోరారు. ఇథనాల్ కేసుల కొట్టివేత, హరిత రిస్టార్ నిర్మాణం, టూరిజం అభివృద్ధి చేయాలని కోరగా, వీటన్నింటిపై సీఎం సానుకూలంగా స్పందించారు.


