‘కేంద్రానివి ప్రజావ్యతిరేక విధానాలు’
భైంసారూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతి రేక విధానాలను అవలంభిస్తోందని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జే రాజు ఆరోపించారు. బు ధవారం మండలంలోని హంపోలి గ్రామంలో ఏఐకేఎంఎస్, ఎస్‌కేఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇటీవల కేంద్రం ఎన్‌జీఎన్‌ఆర్ ఈజీఎస్ చట్టాన్ని ర ద్దు చేస్తూ దాని స్థానంలో జీరామ్‌జీ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని పేర్కొన్నారు. కొత్త చట్టంతో రై తులు, వ్యవసాయ కూలీలు, పేదలు తీవ్రంగా నష్టపోనున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రజావ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జీరామ్‌జీ చట్టం ప్రతులు దహనం చేశారు. నాయకులు దీనాజీ, సాయినాథ్, బాబు, ప్రసాద్, గంగారాం, సురేశ్, ముత్తన్న, రాంసింగ్ తదితరులున్నారు.
లోకేశ్వరం: జీరామ్ జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. మండలంలోని పుస్పూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు, విత్తన చట్టం ముసాయిదా బిల్లు, నూతన ఉపాధిహామీ జీ రామ్‌జీ పథకం, రైతు వ్యతిరేక నల్ల చట్టాల ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారులకు విస్తృతంగా లాభాలు ఆర్జించి పెట్టే చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ముత్తన్న దీనజీ, సాయినాథ్, బాబు ,ప్రసాద్, గంగారాం, సురేశ్, రాంసింగ్ తదితరులున్నారు.


