ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో బుధవారం ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డితో కలిసి సదర్మాట్ బ్యారేజీ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ నిర్మాణం, ప్రారంభోత్సవ వేదిక, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బ్యారేజీ గేట్ల పనితీరును స్వయంగా పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సదర్మాట్ బ్యారేజీతో ఈ ప్రాంత రైతుల కల సాకారం కాబోతుందని తెలిపారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో, అత్యంత అట్టహాసంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ రంగానికి ఈ బ్యారేజీ వెన్నెముకగా నిలుస్తుందని చెప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేసిందని పేర్కొన్నారు. మంత్రి వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులున్నారు.


