కల్యాణం.. కమనీయం
భోగి పర్వదినం, ధనుర్మాసవ్రతంలో భాగంగా పట్టణంలోని దేవరకోట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం గోదా రంగనాథుల కల్యాణ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు మహిళల కోలాటాల మధ్య ఉత్సవమూర్తులను ఊరేగించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కల్యాణం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు కల్యాణం తిలకించి పులకించారు. కార్యక్రమంలో దేవరకోట దేవస్థానం అధ్యక్షుడు ఆవిడ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. – నిర్మల్‌చైన్‌గేట్


