పెండింగ్ బిల్లులు చెల్లించాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు రెండు, మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే చెల్లించి ఆదుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ రామారావు కోరారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్‌కు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. చాలామంది కాంట్రాక్టర్లు అప్పులు చేసి పనులు పూర్తి చేశారని, ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఈనెల 30 వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని, ఈలోగా చెల్లింపులు జరపకపోతే డిసెంబర్ నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. కొత్త పనులను కూడా చేపట్టబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్లు వై.విద్యాసాగర్‌రావు, లక్కడి జగన్మోహన్‌రెడ్డి, ప్రకాశ్ ధనానివాల, సదాశివరెడ్డి, దేవేందర్‌రావు, హరిమోహన్‌రావు, శ్రీధర్‌రావు, అరుణ్‌రెడ్డి పాల్గొన్నారు.


