విద్యార్థుల ఇంటికి అధ్యాపకులు
లక్ష్మణచాంద: కళాశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు అధ్యాపకులు వెళ్లి కళాశాలకు పంపాలని తల్లిదండ్రులకు నోటీసులు అందజేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ముఖ గుర్తింపు హాజరు నమోదు అమలవుతోంది. కళాశాలకు సక్రమంగా రానివిద్యార్థుల తల్లి దండ్రులకు నోటీసులు అందజేయాలని ఇంటర్ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లక్ష్మణచాంద మండలంలోని బాబాపూర్, ఒడ్డెపెల్లి గ్రామాలకు చెందిన ఇంటర్ విద్యార్థుల ఇళ్లకు మామడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన అధ్యాపకులు వచ్చి హాజరు శాతం తక్కువ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు అందజేశారు. ఇకనుంచైనా క్రమం తప్పకుండా కాలేజీకి పంపాలని సూచించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ ప్రతీ విద్యార్థి నిత్యం కళాశాలకు హాజరుకావాలన్నారు. ఇందులో అధ్యాపకులు పురుషోత్తం, రాజు, సుమన్ తదితరులు ఉన్నారు.


