పెటా జిల్లా కార్యవర్గం
నిర్మల్ రూరల్: జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం(పెటా) నూతన కార్యవర్గాన్ని జిల్లా కేంద్రంలో ఆదివారం ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పార్థసారథి, సాయికుమార్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా గుగులావత్ అంబాజీ(జెడ్పీహెచ్‌ఎస్, దిలావర్‌పూర్), ప్రధాన కార్యదర్శిగా డేవిడ్ బెనహర్(జెడ్పీహెచ్‌ఎస్, చామన్‌పల్లి), ఆర్గనైజింగ్ సెక్రెటరీగా వైవీ. రమణారావు(జెడ్పీహెచ్‌ఎస్, వడ్యాల్), కోశాధికారిగా అన్నపూర్ణ(జెడ్పీహెచ్‌ఎస్, చించోలి)ఎన్నికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికై న సభ్యులు తెలిపారు.
అంబాజీ
డేవిడ్ బెనహర్
పెటా జిల్లా కార్యవర్గం


