నాణ్యమైన పత్తికి మద్దతు ధర
నిర్మల్‌చైన్‌గేట్: నాణ్యమైన పత్తిని అమ్మకానికి తెచ్చే రైతులందరికీ మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో కలిసి, పట్టణంలోని కేదారీనాథ్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. పత్తి పంటను అమ్మేందుకు వచ్చిన రైతుతో సాగు చేసిన విస్తీర్ణం, పంట పెట్టుబడి, దిగుబడి, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రైతులు పండించిన పంట మొత్తం సీసీఐ సేకరించాలన్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.8,110 మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలన్నా రు. ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పత్తి రైతులకు ఇబ్బందులు కలగకూడదన్నారు. తేమ నిర్ధారణ పారదర్శకంగా జరగాలని సూచించారు. 12 శాతం తేమ ఉన్న పత్తినే విక్రయానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని తెలిపారు. అంతకుముందు కలెక్టర్, ఎమ్మెల్యే పత్తి వ్యాన్‌కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, రైతులు పాల్గొన్నారు.


