● ఎమ్మెల్యే రామారావుపటేల్ ● పశువైద్యశాల భవనం ప్రారంభం
భైంసాటౌన్: నియోజకవర్గంలో రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పీ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం పట్టణంలోని మండల పశువైద్యశాల నూతన భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ చొరవతోనే ప్రభుత్వం నియోజకవర్గంలో రైతుల పొలాలకు వెళ్లే దారులు నిర్మిస్తోందని చెప్పారు. కుభీర్, బాసర, కల్లూరులో ప్రాథమిక పశువైద్యశాలల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని జిల్లా పశువైద్య, పశుసంవర్ధక అధికారి బాలిక్ అహ్మద్ ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలోని పశువైద్యశాల నూతన భవనంపై రైతుశిక్షణ కేంద్రం కోసం నిధుల మంజూరుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ఏఎంసీ చైర్మన్ సింధే ఆనంద్‌రావు పటేల్, పీఆర్ డీఈఈ రాజేందర్‌రావు, పశువైద్యుడు విఠల్, మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, బీజేపీ నాయకులు తాలోడ్ శ్రీనివాస్, సిరం సుష్మారెడ్డి, పోశెట్టి, గాలి రవి, తూమోల్ల దత్తాత్రి, గాలి రాజు తదితరులు పాల్గొన్నారు.