నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Mar 18 2025 12:17 AM | Updated on Mar 18 2025 12:16 AM

ఊపందుకున్న ‘ఉపాధి’
ఉన్న ఊరిలోనే నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో కేంద్రం అమలు చేస్తున్న ఉపాధిహామీ సత్ఫలితాలిస్తోంది.

మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025

9లోu

ఎన్‌వోసీ ఇప్పించాలి..

మా కుమారుడు రామిళ్ల ఉదయకుమార్‌ నిర్మల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈఈఈ కోర్సును 2011 నుంచి 2013 వరకు చదివాడు. చదువు మధ్యలో నిలిపివేసి మళ్లీ కొనసాగించి కోర్సును పూర్తి చేశాడు. అనంతరం బీఎఫ్‌ఏ యానిమేషన్‌ కోర్సును జెఎన్‌ఎఫ్‌ఏవీఈఏస్‌, హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. గతంలో చదివిన ఈఈఈ మొదటి సంవత్సరం ఫీజు బకాయి ఉన్నందున నేను డీడీవో కోడ్‌ 040–1240 2015 డబ్ల్యూ5ఏస్‌ చలాన నంబర్‌ రూ 3800 చలాన్‌ నం. 6403504732 మీద రూ 2600 గత డిసెంబర్‌ 31న చెల్లించాను. దీనికి సంబంధించిన చలాన్‌ పత్రాలు కార్యాలయంలో అందజేశాను. ఇప్పుడు వెళ్లి అడిగితే ఆ ఫైల్‌ పోయింది అంటున్నారు. మూడు నెలలుగా తిప్పించుకుంటున్నారు. ఎన్‌వోసీ సర్టిఫికెట్‌ అందిస్తేనే మా బాబు ఎంతో కష్టపడి చదివిన బీఎఫ్‌ఏ సర్టిఫికెట్‌ పొందే అవకాశం ఉంది. – రమేశ్‌, కడెం

ఆన్‌లైన్‌ బెట్టింగుల జోలికి వెళ్లొద్దు

ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌ టౌన్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, గేమింగ్‌ల జోలికి వెళ్లొద్దని ఎస్పీ జానకీ షర్మిల జిల్లా ప్రజలకు సూచించారు. యువత, విద్యార్థులు బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌లకు అలవాటుపడి సైబర్‌ ఉచ్చులో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెట్టింగ్‌, గేమింగ్‌ ఆడినా, ప్రోత్సహించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా పోలీస్‌ శాఖ ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: గ్రామ, మండలస్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే న్యాయం జరుగుతుందని, త్వరగా పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వస్తున్నారు. ఆరోజు పనులు మానుకుని.. అర్జీలు చేత పట్టుకుని.. గంటల తరబడి క్యూలో నిలబడి కలెక్టర్‌కు దరఖాస్తులు అందిస్తున్నారు. ఇక సమస్య తీరినట్లే అని ఇళ్లకు వెళ్తున్నారు. కానీ, రోజులు గడుస్తున్నా.. దరఖాస్తుపై ఉలుకు పలుకు ఉండడం లేదు. దీంతో మళ్లీ కలెక్టరేట్‌కు మరో దరఖాస్తు పట్టుకుని వస్తున్నారు. అర్జీల పరిష్కారంలో అధికారుల అలసత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తిరిగి తిరిగి విసిగిపోయిన బాధితుల గోడు వినడం.. ఇచ్చిన దరఖాస్తులు తీసుకోవడమే తప్ప సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇచ్చిన వినతులు అధికారులు తీసుకుని ఆన్‌లైన్‌ చేసి సంబంధిత శాఖ అధికారులకు పంపించడంతో కలెక్టరేట్‌ అధికారుల పని పూర్తవుతోంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు క్షేత్రస్థాయిలో పరిష్కారం అయిందా.. లేదా అన్న విషయంపై సమీక్ష లేకపోవడంతో గ్రీవెన్స్‌ మొక్కుబడిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిసెంబర్‌ నెలలో ఇచ్చిన అర్జీ పరిష్కారం కాక.. మళ్లీ మూడు నెలల తర్వాత బాధితుడు మళ్లీ ప్రజావాణికి రావడం చూస్తే సమస్యల పరిష్కారం ఎంత వేగంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్‌ ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.

ప్రతీ వారం కిటకిటే..

ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఇందులో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. మండల స్థాయిలో తమ గోడు వెల్లబోసుకున్నా పరిష్కారం కాని సమస్యలపై బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ సోమవారం ప్రజావాణి కిటకిటలాడుతోంది. వందల అర్జీలు వస్తున్నాయి. కొన్నింటిని వెంటనే పరిష్కరిస్తున్న ఉన్నతాధికారులు.. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన వాటిని ఆయా మండలాలకు పంపుతున్నారు. అయితే అక్కడికి వెళ్లే దరఖాస్తులు త్వరగా పరిష్కారం కావడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. చేసేదేమీలేక మళ్లీ ఉన్నతాధికారులకు సమస్యను నివేదించేందుకు వస్తున్నామని చెబుతున్నారు.

పెండింగ్‌లో 251 అర్జీలు..

కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి సంబంధించి ఇప్పటి వరకు 70 శాఖల పరిధిలో 251 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు సోమవారం మరో 86 అర్జీలు అధికారులు స్వీకరించారు. ముఖ్యంగా విద్యాశాఖలో 14, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ నిర్మల్‌ శాఖలో 14, సూపరింటెండెంట్‌ ఈ సెక్షన్‌లో 10, సూపరింటెండెంట్‌ డి సెక్షన్‌లో 9, నిర్మల్‌ రూరల్‌ తహసీల్దార్‌ వద్ద 9, డిస్టిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో 8, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద 8, నిర్మల్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ 8, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ 8, లోకేశ్వరం తహసీల్దార్‌ 8, ముధోల్‌ తహసీల్దార్‌ 8, తెలంగాణ స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ 8, కుభీర్‌ తహసీల్దార్‌ 7, టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ 7, జిల్లా వ్యవసాయ అధికారి 6, జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి 6, జిల్లా పంచాయతీ అధికారి 6, దేవాదాయ శాఖ 6, ఖానాపూర్‌ తహసీల్దార్‌ 6, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ 5, నిర్మల్‌ అర్బన్‌ తహసీల్దార్‌లో 5 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి.

ప్రజావాణిలో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, అదనపు కలెక్టర్లు

దాడిపై కేసు నమోదు

ఖానాపూర్‌: పట్టణంలోని మహాత్మాజ్యోతి బాపూలే జూనియర్‌ కళాశాల వసతి గృహంలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థి తరుణ్‌పై దాడి చేసిన సీనియర్‌ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సీఐ అజయ్‌, ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపారు. వాలీబాల్‌ విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని దాడిచేసిన సీనియర్‌ విద్యార్థి తనయ్‌తోపాటు అతని స్నేహితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇఫ్తార్‌

మంగళ : 6:22

సహర్‌

బుధ : 5:05

న్యూస్‌రీల్‌

త్వరగా పరిష్కరించాలి..

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌, రైతు రుణమాఫీ వంటి సమస్యలను పరిష్కరించాలని 86 అర్జీలను సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరుచాలన్నారు. దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఫైజాన్‌ అహ్మద్‌, కిశోర్‌కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు

కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్న బాధితులు

బాధ్యులపై చర్య తీసుకోవాలి..

నా భార్య తొండకూరి స్వరూపను రెండో కాన్పు నిమిత్తం జనవరి 30న జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశాను. అదేరోజు వైద్యులు శస్త్రచికిత్స చేస్తే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 4న డిశ్చార్జ్‌ చేశారు. కుట్లు విడిపించిన తర్వాత చీము వచ్చి పొట్ట భాగం ఉబ్బింది. ఆస్పత్రికి పలుసార్లు తీసుకువచ్చి చూపించాను. సీటీ స్కాన్‌ తీసి ప్రాబ్లం లేదని చెప్పారు. తర్వాత నాభార్య తీవ్ర కడుపు నొప్పి రావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరీక్షలు చేసి డెలివరీ సమమంలో నిర్లక్ష్యం కారణంగా కడుపులో ఇన్‌ఫెక్షన్‌ అయిందని చెప్పి ఆపరేషన్‌ చేసి ట్రీట్‌మెంట్‌ అందించారు. నిజాన్ని దాచి నా భార్యకు ప్రాబ్లం లేదని చెప్పిన బాధ్యులపై చర్య తీసుకోవాలి.

– టి.శ్రీకాంత్‌, జఫ్రాపూర్‌

నిర్మల్‌1
1/1

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement