Zika Virus In Karnataka: జికా వైరస్ కలకలం.. కర్ణాటకలో తొలి కేసు.. ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్‌

Zika Virus: First case in Karnataka 5 Year Old Girl Tests Positive - Sakshi

కర్ణాటకలో జికా వైరస్‌ కలకలం రేగింది. రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. రాయచూర్‌ జిల్లాలోని అయిదేళ్ల బాలికకు జికా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కే సుధాకర్‌ తెలిపారు. కొన్ని రోజులుగా చిన్నారి అనారోగ్యానికి గురైందని, డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో టెస్ట్‌లు చేయించినట్లు తెలిపారు. టెస్టుల్లో పాజిటివ్‌గా రావడంతో చిన్నారికి అన్ని జాగ్రత్త చర్యలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

మంత్రి సుధాకర్ మాట్లాడుతూ.. పూణె నుంచి వచ్చిన ల్యాబ్‌ నివేదిక ద్వారా జికా వైరస్‌ నిర్ణారణ జరిగిందన్నారు. డిసెంబర్‌ 5న ముగ్గురి నామూనాలను ల్యాబ్‌కు పంపించగా ఇద్దరికి నెగిటీవ్‌ వచ్చిందని అయిదేళ్ల చిన్నారికి పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. రాష్ట్రంలో ఇదే మొదటి కేసని వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో పరిస్థితిని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు.  

ఏదైనా ఆసుపత్రుల్లో అనుమానాస్పద ఇన్‌ఫెక్షన్ కేసులు కనిపిస్తే జికా వైరస్ పరీక్షల కోసం నమూనాలను పంపాలని రాయచూర్ దాని పొరుగు జిల్లాల్లోని ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని, అన్ని ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా కొన్ని నెలల కిత్రం జికా వైరస్‌ కేరళలో తొలిసారి వెలుగు చూసిన విషయం తెలిసిందే. తరువాత మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. 
చదవండి: అందుకే ‘హెల్మెట్‌’ పెట్టుకోమని చెప్పేది.. ఓసారి ఈ వీడియో చూడండి

జికా వైరస్‌ ఏలా వ్యాప్తిస్తుంది
జికా వైరస్ వ్యాధి  ఎడెస్ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ,  చికున్‌గున్యా వంటి ఇన్‌ఫెక్షన్లను కూడా ఇదే దోమే  వ్యాపి చేస్తుంటుంది. ఈ వైరస్‌ను మొదటిసారిగా 1947లో ఉగాండాలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఎడెస్ దోమలు సాధారణంగా పగటిపూట కుడతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాయి. అయితే ఈ వైరస్‌ పెద్దగా ప్రాణాంతకం కాదు. చికిత్సతో రికవరీ అవుతారు. కానీ గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారి కడుపులోని పిండానికి ఇది చాలా ప్రమాదకరం. మైక్రోసెఫాలీ (మెదడుపై ప్రభావం) లేదా పుట్టుకతో వచ్చే జికా సిండ్రోమ్ అని పిలువబడే ఇతర పరిస్థితులకు కారణమవుతుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top