సినీ ఫక్కీలో మహిళ కిడ్నాప్.. అర్ధరాత్రి 15 మంది ఇంట్లో దూరి..

అర్ధరాత్రి ఓ మహిళను 15 మంది కలిసి కిడ్నాప్ చేశారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు గేటు బద్దలుకొట్టి మరీ మహిళను ఎత్తుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కొన్ని గంటల్లోనే నిందుతులను పట్టుకుని మహిళను కాపాడారు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. మైలాడుతురైలో చెందిన ఓ యువతి(24)తో నిందితుల్లో ఒకరైన విఘ్నేశ్వరన్‌కు కొద్ది రోజుల కిత్రం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో విఘ్నేశ్వరన్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో, బాధితురాలు.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అనంతరం.. వ్రాతపూర్వకంగా లేఖ రాయించుకుని విఘ్నేశ్వరన్‌కు విడుదల చేశారు.
ఈ క్రమంలో బయటకు వచ్చిన విఘ్నేశ్వరన్.. యువతిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో, నిందితుడు మరో 14 మందితో కలిసి మహిళను కిడ్నాప్ చేశారు. 15 మంది కలిసి ఆమె ఇంటి గేటును బద్దలుకొట్టి మరీ.. ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కిడ్నాప్ చేశారు. కారులో ఆమెను సిటీ దాటిస్తుండగా.. రంగంలోకి దిగిన పోలీసులు వెంబడించి హైవేపై వారిని పట్టుకున్నారు. ఆమెను విడిపించి.. ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
Fifteen men kidnap woman from her residence in Mayiladuthurai, Tamilnadu! pic.twitter.com/WCK1AFdW7l
— karthik gopinath (@karthikgnath) August 3, 2022