వాట్సాప్ కొత్త పాలసీపై కేంద్రం ఆగ్రహం | WhatsApp Treating Indian users Differently Matter of Concern | Sakshi
Sakshi News home page

వాట్సాప్ కొత్త పాలసీపై కేంద్రం ఆగ్రహం

Jan 25 2021 8:41 PM | Updated on Jan 25 2021 8:55 PM

WhatsApp Treating Indian users Differently Matter of Concern - Sakshi

న్యూఢిల్లీ: నూతన వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఇండియన్ యూజర్లు విచారం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ పాలసీ తీసుకొచ్చాక చాలా మంది వాట్సాప్ వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసెంజర్ యాప్ లకు తరలివెళ్తున్నారు. చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో వాట్సాప్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్బంగా కేంద్రం వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.(చదవండి: ఇండియాలో 5జీ ఎప్పుడు రానుంది?)

యూరోపియన్ వినియోగదారులు, భారతీయ వినియోగదారులను వాట్సాప్ వేర్వేరుగా చూస్తుందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కొత్త పాలసీ నిబంధనలకు సంబందించిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వాట్సాప్ కు లేఖ పంపినట్లు విచారణ సందర్భంగా అడిషిషనల్ సోలిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు. సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ భారతీయ వినియోగదారుల గోప్యతా విషయంలో "ఏకపక్షంగా" వ్యవహరిస్తుందని ఇది ఆందోళన కలిగించే విషయమని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.(చదవండి: ఇండియన్ పబ్‌జీ(ఫౌజీ) విడుదల రేపే!)

మళ్లీ మార్చి 1కి వాయిదా 
యూరోపియన్ లో వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకోవడం నేరం కావడంతో అక్కడ తప్పనిసరిగా వాట్సాప్ నిబంధనలను అంగీకరించాలనే నిబంధన లేదు.. కానీ ఇండియాలో అందుకు విరుద్దంగా వాట్సాప్ యూజర్లు తప్పనిసరిగా నిబంధనలు తీసుకురావడం ఆందోళన కలిగిస్తోందని చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు. ఈ అంశం వినియోగదారుల సమాచారం భద్రత, గోప్యతకు భంగకరమని కోర్టుకు నివేదించారు. అయితే ప్రభుత్వం కోరిన వివరాలపై త్వరలోనే స్పందిస్తామని వాట్సాప్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఈ విచారణను మార్చి 1కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement