ఆర్థిక సంస్కరణలతో ప్రజలకు మేలు: ముఖేష్‌ అంబానీ

We can make next 30 years the best in India history says Mukesh Ambani - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో మూడు దశాబ్దాల ఆర్థిక సంస్కరణలతో పౌరులు అసమానమైన ప్రయోజనలు పొందుతున్నారని ఇప్పుడు ‘ఇండియన్‌ మోడల్‌’ దిశలో సంపద సృష్టించడంపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ అభిప్రాయపడ్డారు. 2047 నాటికి అమెరికా, చైనా దేశాలతో సమానంగా ఇండియా ఎదుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల ఆర్థిక సరళీకరణ సందర్భంగా ఆయన అరుదైన కాలమ్‌ రాస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లుగా సంపద సృష్టి మీద మాత్రమే దృష్టి సారించామని.. అందరికీ విద్య, అందరకీ ఆరోగ్యం, అందరికీ ఉపాధి, అందరికీ హౌసింగ్‌ సాధించడంలోనే నిజమైన సంపద దాగుందనే సత్యాన్ని విస్మరించామని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో కంపెనీల విస్తరణ సమయంలో ప్రజల శ్రేయస్సు, సంరక్షణ అంశాలను పట్టించుకోవటం లేదని ఈ అంశాల్లో భారత్‌ ప్రారంభ దశలో ఉందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top